Mahindra Car : ఆటోమొబైల్ రంగం అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ మయం గా మారుతుంది. కొత్తగా కారు కొనాలనుకునేవారు విద్యుత్ కారును ఎంచుకుంటున్నారు. అయితే ఇందులోను SUV వేరియంట్ అయితే ఇంకా బెటర్ అని ఆలోచించేవారు పెరుగుతున్నారు. ఈ విషయాన్ని కొన్ని కంపెనీలు గ్రహించి వినియోగదారుల కోసం ఎస్ యు వి ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేంద్ర కంపెనీ నుంచి కొన్ని ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. ఎస్ యు వి వేరియంట్ కావాలని అనుకునేవారు ఇవి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ కార్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read : అతడి ఆనందాన్ని చూసి చలించి పోయాను.. ఆనంద్ మహీంద్రా
దేశీయ ఆటోమొబైల్ రంగంలో Mahindra కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. SUV వేరే ఇంట్లో కార్లు తీసుకురావడంలో మహీంద్రా కు మించిన వారు ఎవరూ లేరని కొందరు అంటూ ఉంటారు. ఇప్పటికే మహీంద్రా నుంచి BE 6,XEV 9e, ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఆదరణ పొందాయి. వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోవడంతో మరికొన్ని మోడల్స్ ను తీసుకురావాలని చూస్తోంది.
అయితే మహేంద్ర నుంచి ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన బొలెరో, స్కార్పియో, Thar వంటి వాహనాలు అత్యధిక ప్రజాదరణ పొందాయి. అయితే ఇప్పుడు వీటిని ఎస్ యు వి ఎలక్ట్రిక్ వాహనాలుగా తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీటిలో Mahindra XEV 7 కారును కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిని 2025 చివరి నాటికి మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారు ఫుల్ చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే ఇందులో స్టైలిష్ లుక్ కోసం క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గిల్, నువ్వు 2 adaas వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే మహేంద్ర కు చెందిన మరో కారు XUV 3×0 EV కారును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చాట్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో హడాస్ షూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్పీడ్ అలర్ట్ సిస్టం, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కలిగి ఉన్నాయి. అలాగే ఇవి టాటా nexaan ev కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే కంపెనీకి చెందిన మరో కారు BE సిరీస్ EV. సెవెన్ సీటర్ కలిగిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ ఎస్ యు వి గా అభివృద్ధి అవుతోంది. ఇందులో రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి అనుగుణంగా ఉంటుంది. ఇది అతి కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రాబోతుంది. అలాగే మహేంద్ర కు చెందిన కార్ కూడా ఎలక్ట్రిక్ Version లో రాబోతుంది.
Also Read : Mahindra నుంచి SUV ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందో తెలుసా?