Mahindra Bolero: మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా ‘బొలెరో నియో ప్లస్’.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

మహీంద్రా నుంచి రిలీజ్ అయిన ‘బొలెరో నియో ప్లస్’ 2.2 లీటర్ ఎంహ్యాక్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 120 హార్స్ పవర్ తో 280 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు ఫోర్స్ సిటీ లైన్, ఫోర్స్ గుర్ఖా 5 డోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీనిని ఎంట్రీ లెవెల్ పీ 4 ట్రిమ్ ధర రూ.11.39 లక్షలుగా నిర్ణయించారు.

Written By: Srinivas, Updated On : April 18, 2024 4:29 pm

Mahindra bolero neo plus

Follow us on

Mahindra Bolero ప్రముఖ కార్ల ఉత్పత్తి కంపెనీ మహీంద్రా నుంచి ఆకట్టుకునే కార్లు వచ్చాయి. ఎస్ యూవీ లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రాను మించిన కంపెనీ లేదని చెప్పుకుంటున్నారు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా బొలెరో ఎంతో మందిని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఇదే బొలెరోను ‘బొలెరో నియో ప్లస్’ పేరిట ఉత్పత్తి చేసి ఇటీవల లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పటికే ఆన్ లైన్ లోకి వచ్చాయి. అయితే ఈ మోడల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

మహీంద్రా నుంచి రిలీజ్ అయిన ‘బొలెరో నియో ప్లస్’ 2.2 లీటర్ ఎంహ్యాక్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 120 హార్స్ పవర్ తో 280 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు ఫోర్స్ సిటీ లైన్, ఫోర్స్ గుర్ఖా 5 డోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీనిని ఎంట్రీ లెవెల్ పీ 4 ట్రిమ్ ధర రూ.11.39 లక్షలుగా నిర్ణయించారు. టాప్ స్పెక్ పీ 10 ధర రూ.12.49 లక్షలుగా ఉంది. నియో ప్లస్ సబ్ కాంపాక్ట్ బొలెరో ఇది మూడు వరుసల 9 సీటర్ వెర్సన్.

కొత్త మహీంద్రా బొలెరో వాహనం బుల్ బార్ మాదిరిగా ఉండే డిజైన్ ఎలిమెంట్ ను కలిగి ఉంది. ఇందుల 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఉన్నాయి. ఇది సాధారణ బొలెరో కంటే 405 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవును కలిగి ఉంది. అయితే వీల్ బేస్ మాత్రం పాతదాని లాగే ఉంటుంది. ఇందులో రియర్ డోర్, రియర్ డోర్ ప్యానెల్ కొత్తగా కనిపిస్తాయి. పెద్ద ర్యాప్ రౌండ్ టెయిల్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తంగా కొత్త డిజైన్ ఆకట్టుకుంటుంది.

ఇంటీరియర్ డిజైన్ విషానికొస్తే.. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, రివైజ్డ్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. సేప్టీ కోసం ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అలరిస్తాయి. ఇక డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఐపోపిక్స్ మౌంట్స్ వంటి ఫీచర్స్ ప్రయాణికులకు అత్యంత రక్షణ ఇస్తాయి.