OnePlus Nord 5 features: Oneplus కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్స్ భారత్లో ఎక్కువగా ఆదరణ పొందుతూ ఉంటాయి. ఇందులో నాణ్యమైన కెమెరాతో పాటు మెరుగైన బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండడంతో చాలామంది ఈ కంపెనీకి చెందిన ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కాస్త ధర ఎక్కువైనా సరే వన్ ప్లస్ మొబైల్ అంటే లైక్ చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ కంపెనీ లేటెస్ట్ గా కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. వన్ ప్లస్ నార్డు 6 పేరిట వచ్చిన ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
వన్ ప్లస్ నుంచి ఇప్పటికే Nord 5 అనే మొబైల్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మార్కెట్లోకి Nord 6 వచ్చింది. పి కొత్త మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 k resolution తో పనిచేస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో 3600 nits బ్రైట్నెస్ ఉండనుంది. దీంతో ఎటువంటి వాతావరణం లోనైనా ఇందులో అద్భుతమైన కాంతిని పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 సాఫ్ట్వేర్ ఉండనుంది. ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ఆఫీసర్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఇది బాగా పనిచేస్తుంది.
మొబైల్లో మంచి కెమెరా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ మొబైల్ లో 50 ఎంపీ సోనీ కెమెరా ఉండనుంది. దీనితోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో కెమెరా పనిచేస్తుంది. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం ఇందులో 32 మెగాపిక్సల్ తో కెమెరా పనిచేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారితో పాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరాలు సపోర్ట్ గా ఉండలు ఉన్నాయి. అలాగే ఈ కొత్త మొబైల్ లో 9000 mAh బ్యాటరీ ఉంచారు. ఈ బ్యాటరీ 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్.. 27 W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఈ చార్జర్ ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది.
వీటితోపాటు ఇందులో ఆడియో స్పీకర్స్, ఫోర్ ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇందులో పొందవచ్చు. వన్ ప్లస్ nord 6 మొత్తం 6 మోడల్స్ లో లభ్యం అవుతుంది. ఇందులో 8gb రామ్, 256 జిబి స్టోరేజ్ కలిగిన మొబైల్ ను రూ.38,999 తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.41,999 గా ఉంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి దీనిని ఆమెజాన్, వన్ ప్లస్ స్టోర్ లలో విట్లయించనున్నారు.