LPG Gas cylinder: ప్రస్తుతం గ్యాస్ ధరలు ఆకాశాన్ని చేరుకున్నాయి.రోజురోజుకు గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యుడికి అధిక భారం పడుతోంది. ఈ క్రమంలోనే పేటీఎం వినియోగదారులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేటీఎమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఏవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందాలి అనే విషయానికి వస్తే…
Also Read: మీరు నిద్రప్రియులా… అయితే లక్షలు సంపాదించే అవకాశం మీ సొంతం.. ఎలాగో తెలుసా?
పేటీఎం కొత్త పథకం కింద గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి 700 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ క్యాష్ బ్యాక్ ధరతో మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను సొంతం చేసుకోవచ్చు.అయితే ఈ అవకాశాన్ని ఎలా పొందాలి అనే విషయానికి వస్తే మనం పేటియం యాప్ ద్వారా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు మనకు స్క్రాచ్ కార్డు వస్తుంది. ఎల్పిజి, హెచ్ పి, ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకుంటున్న సమయంలో ఈ స్క్రాచ్ కార్డు ఉపయోగించడం వల్ల 24 గంటలలో పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది.
అయితే పేటీఎమ్ ద్వారా కొత్తగా గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.అయితే IVRS లేదా ఇతర పద్ధతుల ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకునేవారికి కూడా లభిస్తుంది. కానీ పేటీఎం యాప్ ద్వారా మొదటిసారిగా నగదు చెల్లింపు చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా సబ్సిడీ పోను వచ్చే డబ్బుతో మనం ఉచితంగా గ్యాస్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?