Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తన సహజమైన గుణంతో ఎప్పుడు వార్తల్లో నిలిచే రోహిత్ తాజాగా ఇండియా, న్యూజిలాండ్ రెండో మ్యాచ్ లో విజయం సాధించినా ఆయన తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలవడం గమనార్హం. ఎవరికైనా తన మాట వినకుంటే సహజంగా కోపం వస్తుంది. కానీ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రోహిత్ మాత్రం తనలోని కోపాన్ని మరోసారి బహిర్గతం చేసుకుని నెట్టింట్లో విమర్శల పాలవుతున్నాడు.
ఇండియా, న్యూజిలాండ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్లో ఆఖరి బంతిని జిమ్మీ నీషమ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. కానీ క్యాచ్ పట్టిన పంత్ అప్పీల్ చేయలేదు. దీంతో రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పీల్ చేయాలి కదా అని పంత్ పై కోపంతో చూసినట్లు సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో రోహిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
కానీ నీషమ్ మాత్రం తాను ఔటయినట్లే భావించి వెనుదిరిగి పోయాడు. అక్కడ రోహిత్ కు కోపం రావాల్సిన సందర్భం లేకపోయినా రోహిత్ మాత్రం తనలోని కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. కీపర్ పంత్ పై కళ్లతోనే నిప్పుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. రోహిత్ సీరియస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరిగిన అతి పెద్ద తప్పు ఇదే
నీషమ్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు. కొందరు ఆటగాళ్లయితే తాను ఔటు కాలేదని బుకాయిస్తారు. కానీ అతడు మాత్రం ఎవరు నిందించకుండా తానే ముందుగానే ఔటయినట్లు గుర్తించి పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా కీపర్ పై ఉగ్రరూపంతో చూడడం చర్చనీయాంశం అవుతోంది. బాధ్యతాయుతమైన ఆటగాడిగా రోహిత్ తన కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: David Warner : డేవిడ్ వార్నర్ కే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకే ఇచ్చారట.?