https://oktelugu.com/

Low Price SUV: తక్కువ ధరలో SUV.. చూస్తే కొనేస్తారు.. ఏ కారో తెలుసా?

SUVఅనగానే రూ.10 లక్షల పై మాటే ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కాంపాక్ట్ SUVలను తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఎస్ యూవీలనే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 12, 2024 / 03:03 PM IST

    Hyundai Exter

    Follow us on

    Low Price SUV: నేటి కాలంలో కారు కొనాలనుకునేవారు SUVలను ఎక్కువ కోరుకుంటున్నారు. విశాలమైన స్పేస్ తో పాటు హై స్సెషిఫికేషన్ తో ఆకర్షిస్తున్నాయి. అయితే SUVఅనగానే రూ.10 లక్షల పై మాటే ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కాంపాక్ట్ SUVలను తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఎస్ యూవీలనే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ కారు గత ఏడాదే రిలీజ్ అయినా.. అమ్మకాల్లో జోరందుకుంది. ఇప్పటికీ దీని కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    దేశంలో కార్ల ఉత్పత్తిలో మిగతా కంపెనీలకు పోటీ ఇస్తోంది హ్యుందాయ్. ఈ కంపెనీ నుంచి 2023లో ఎక్స్ టర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అంతకుముందు టాటా కంపెనీ పంచ్ తో అలరిస్తుండగా దానికి పోటీగా దీనిని తీసుకొచ్చారు. తక్కువ ధరకే ఎస్ యూవీని అందించాలన్న ఉద్దేశంతో దీనిని ఉత్పత్తి చేశారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల లోపు ఎస్ యూవీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

    హ్యుందాయ్ ఎక్స్ టర్ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెట్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNGవెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లో ఇది 81 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ విషయానికొస్తే 68 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎంట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ తో లీటర్ కు 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ తో 27.1 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

    ఎక్స్ టర్ ను ఎక్కువగా వినియోగదారుని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి చేశారు. ఇందులో రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో 60 కి పైగా కనెక్ట్ చేసిన కారు ఫీచర్లు ఉన్నాయి. 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు 4.2 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లేను కలిగి ఉంది. దీనిని రూ.6 నుంచి 7 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. హ్యాచ్ బాక్ కార్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎస్ యూవీలు కూడా అందుబాటు ధరలోకి రావడంతో చాలా మంది వీటిపైనే దృష్టి పెడుతున్నారు.