Actress: టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు పూరి జగన్నాథ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ లను సంపాదించారు. అంతేకాదు హీరోలను డిఫరెంట్ గా చూపించడంలో కూడా దిట్టా అని పేరు సంపాదించారు పూరీ. ఈయన తెరకెక్కించే సినిమాల్లో డైలాగులు సూపర్ గా ఉంటాయనే టాక్ కూడా ఉంది. యూత్ తొందరగా ఆకర్షితులవుతారు. ఈయనతో సినిమాలు చేయాలని చాలా మంది హీరోలు ఎదురుచూస్తుంటారు.
మాస్ మహారాజా కూడా ఈయనతో సినిమాలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి ఇలా వరుస సినిమాలు సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాయి. వీటిలో అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి డిఫరెంట్ మూవీ. ఈ సినిమా కథతో పాటు రవితేజ నటన, మూవీలో డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా కదలకుండా చూసే వారి సంఖ్య ఎక్కువే. ఈ సినిమాలో రవితేజ సరసన ఆసిన్ నటించింది.
కమెడియన్ గా అలీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇదే సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ చేతిలో మోసపోయి అనుకోని పరిస్థితుల్లో ఉన్న ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకుంటాడు అలీ. ఈమె మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు అల్ఫోన్సా. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. తెలుగులో వెంకటేష్ నటించిన ప్రేమించుకుందా రా అనే సినిమాలో కూడా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
మరి ఇప్పుడు ఈ భామ ఎలా ఉందో అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2013 తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తుంది. ఇక ఇప్పుడు వైరల్ గా మారిన ఈ ఫోటో కూడా పాతదే అని తెలుస్తోంది.