Telugu News » Business » Low price car these are the best cars that come within rs 5 to 7 lakh
Low Price Car : రూ.5 నుంచి 7 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే..
కొన్ని కంపెనీలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలో అప్డేట్ ఫీచర్స్ తో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
Written By:
Srinivas, Updated On : January 29, 2024 12:39 pm
Follow us on
Low Price Car :కార్లు కొనాలనుకునే చాలా మంది ఆకర్షణీయమైన డిజైన్ చూస్తారు. ఆ రువాత ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటారు. చివరగా కారు రేటు పై దృష్టి పెడతారు. అయితే ఫీచర్స్ కు , ధరకు చాలా తేడా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలో అప్డేట్ ఫీచర్స్ తో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఒకప్పుడు ఎస్ యూవీ లాంటి కార్లలో ఉండే ఫీచర్లను హ్యాచ్ బ్యాక్ లో కూడా అమరుస్తూ ఆకట్టుకుంటున్నారు. దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చి.. అద్భుతమైన ఫీచర్లు కలిగిన రెండు కార్లు రూ. 7 లక్షల లోపే అందిస్తున్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..
దేశంలో దశాబ్దాలుగా అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకి కంపెనీ. దీని నుంచి వచ్చిన ఏ మోడల్ అయినా వినియోగదారులను ఆకర్షిస్తుందనే పేరు ఉంది. ఎన్నో ఇతర దేశాల కంపెనీలు ఎంట్రీ ఇచ్చినా.. మారుతి సుజుకీకి ఉండే క్రేజ్ వేరు అని కొందరి నమ్మకం. ఈ తరుణంలో కంపెనీ సైతం కొత్త మోడళ్లను తీసుకొస్తూ తక్కువ ధరకే అందిస్తోంది. వీటిలో మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ గా చెప్పుకోవచ్చు. ఈ కారు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మకాల్లో ముందంజగా నిలుస్తోంది.
మారుతి వ్యాగన్ఆర్ ఫీచర్స్ విషయానికొస్తే.. 1,0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 బీహెచ్ పీ పవర్; 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇది పెట్రోల్ తో పాటు CNG ఎంపిక కూడా ఉంది. వ్యాగన్ ఆర్ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే తో పాటు 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ అమౌంట్, ఆడియో కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి. ఈ కారు రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల లోపు ఇంటికి తీసుకురావొచ్చు. వ్యాగన్ ఆర్ లీటర్ పెట్రోల్ 24.35 కిలోమీటర్లు, సీఎన్ జీ 34.05 కిలోమీటర్లు దూసుకెళ్తుంది.
మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ తో పాటు సెలెరియో కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంది. ఫీచర్స్ దాదాపు వ్యాగన్ ఆర్ తో సమానంగా ఉన్నా సెలెరియోలో లగేజ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ధర విషయంలో మాత్రం వ్యాగన్ ఆర్ కంటే తక్కువగానే ఉంది. సెలెరియోను రూ.5.37 లక్షల నుంచి రూ.7.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. సెలెరియో లీటర్ పెట్రోల్ కు రూ.25.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ లో 34.43 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లొచ్చు.