Lost Car Key : నేటి కాలంలో కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ దానిని మెయింటేన్ చేయడమే అసలైన పని. కారులో ఫ్యూయెల్ నుంచి పార్ట్స్ వరకు అన్నీ చెక్ చేసుకోవడమే కాకుండా ఎప్పడూ కారుకు సంబంధించిన పరికరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కారు కీ పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది కారు Key పోయినప్పుడు డూబ్లికేట్ Key ని తయారు చేసుకుంటారు. లేదా అందకుముందు ఉన్న మరో కీతో కారును నడుపుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎంత పెద్ద డేంజరో తెలిస్తే షాక్ అవుతారు. డూబ్లికేట్ కీ తో మీరు మీ కారు నడుపుతున్నప్పుడు అసలైన కీ దొంగవద్ద ఉన్నట్లే కదా? అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే రూ.100 మాత్రమే ఖర్చుపెట్టండి.. అందుకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం..
కారును కొనుగోలు చేసేటప్పుడు షోరూం ప్రతినిధులు మనకు కొన్ని సూచలను ఇస్తూ ఉంటారు. కానీ మనం వాటిని పట్టించుకోం. ముఖ్యంగా కారు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కొందరు ఒత్తిడి చేస్తారు. అప్పటి వరకు ఇన్సూరెన్స్ చేస్తాం. కానీ ఆ తరువాత నిర్లక్ష్యం చేస్తాం. అయితే కారుకు ఇన్సూరెన్స్ చేయాలంటే ఇబ్బందిపడినప్పుడు కారు Key కి ఇన్సూరెన్ష్ చేయమంటే ఊరుకుంటారా? అవును కారు Key కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఈ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి అంటే?
కారు ఫస్ట్ Key ని ఎవరైనా దొంగిలించినప్పుడు దాని డూబ్లికేట్ కీని ఎక్కడో రోడ్డు పక్కన షాపులో తయారు చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల రూ.200 వరకు ఖర్చు అవుతుంది కావచ్చు. కానీ దీనిని మేకింగ్ చేసేవాళ్ల దగ్గర లాక్ సిస్టమ్ కాపీ అవుతుంది. దీంతో వారు మరో కీ ని తయారు చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కారు లాకింగ్ సిస్టమ్ మొత్తం మార్చేయాలి. అలా మార్చాలంటే రూ.25000 వరకు ఖర్చవుతుంది. ఇదంతా ఎందుకని స్ట్రీట్ వెండర్ దగ్గర కీ చేయించుకున్నారని అనుకుందాం.. ఈ కీతో మీరు కారు నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఈ సమయంలో డబ్లికేట్ కీ ఉందంటే వారు యాక్సెప్ట్ చేయరు. కచ్చితంగా మెయిన్ కీ కావాలని అడుగుతారు. అందువల్ల రూ.25000 పెట్టి కొత్త లాక్ సిస్టమ్ అమర్చుకోక తప్పదు.
ఈ బాధ రాకుండా ఉండాలంటే కారు Key కి కూడా ముందుగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇలా ఇన్సూరెన్ష్ చేయడం వల్ల ఏడాదికి రూ.100 నుంచి రూ.300 మాత్రమే ఖర్చవుతుంది. ఇలా చేయడం వల్ల మీ కారు కీ పోయినా మీకు లాక్ సిస్టమ్ ను ఉచితంగానే అందిస్తారు. దీతో మీ కారును సేఫ్ గా దొంగల నుంచి తప్పించుకోవచ్చు. చాలా మంది చిన్న చిన్న ఖర్చులకు భయపడుతుందారు. కానీ సమస్య వచ్చినప్పుడు వృథా ఖర్చుకు వెనుకాడరు. అందువల్ల ముందు జాగ్రత్తగా కారు Key ఇన్సూరెన్ష్ కూడా తీసుకోండి. పూర్తి వివరాలకు కారు షోరూంలో సంప్రదించండి.