Lic Policy: దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో సరల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. జీవించి ఉన్నంత కాలం మనీ పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. 40 సంవత్సరాల వయస్సులోనే రెగ్యులర్ ఇన్ కమ్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందాలని అనుకుంటే మాత్రం ఇతర స్కీమ్స్ ను ఎంచుకోవచ్చు.
సరల్ పెన్షన్ యోజన సింగిల్ పెన్షన్ స్కీమ్ కాగా ఒకేసారి ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నామినీ లేదా భాగస్వామి పొందే విధంగా ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నచ్చిన ఆప్షన్ ను ఎంచుకుని ఈ పాలసీలో కొనసాగవచ్చు. ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో ఈ పాలసీని తీసుకోవచ్చు.
Also Read: BJP Navakumar: బీజేపీకి వాయిస్ గా మారిన ‘నవ కుమార్’
కనీసం 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ఎంచుకునే ఆప్షన్ ద్వారా నెల, మూడు నెలలు, ఐదు నెలల చొప్పున ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదికి 56,450 రూపాయలు పెన్షన్ గా లభిస్తుంది.
కనీసం 1,000 రూపాయల నుంచి పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.