https://oktelugu.com/

LIC: పేద ప్రజల కోసం ఎల్‌ఐసీ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆదాయం!

LIC: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేద ప్రజలకు తీపికబురు అందించింది. పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎల్‌ఐసీ భాగ్య లక్ష్మి ప్లాన్‌ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ఈ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ పరిమిత కాలం ప్రీమియం ప్లాన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 30, 2021 / 09:49 AM IST
    Follow us on

    LIC: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేద ప్రజలకు తీపికబురు అందించింది. పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎల్‌ఐసీ భాగ్య లక్ష్మి ప్లాన్‌ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ఈ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు.

    LIC

    ఈ ప్లాన్ పరిమిత కాలం ప్రీమియం ప్లాన్ కాగా చెల్లించిన ప్రీమియంలో 110 శాతంను మెచ్యూరిటీపై పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు పాలసీ వ్యవధితో పోలిస్తే తక్కువ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించవచ్చు.

    Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

    ఈ పాలసీలో కనీస హామీ మొత్తం 20,000 రూపాయలు కాగా గరిష్ట హామీ మొత్తం 50,000 రూపాయలుగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిటర్ ఎక్కువ మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు రుణం తీసుకునే అవకాశం ఉండదు. అయితే పాలసీని సరెండర్ చేసే వెసులుబాటు మాత్రం ఉంటుంది. పాలసీ సరెండర్ చేస్తే డిపాజిట్ మొత్తంలో 30 శాతం నుంచి 90 శాతం వరకు పొందవచ్చు.

    ఎక్కువ కాలం పాలసీ కొనసాగితే సరెండర్ విలువ కూడా అంత ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: పది, ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త.. రూ.20,000 స్కాలర్ షిప్!