Lic kanyadan Policy: ఎల్ఐసీ సూపర్ పాలసీ.. కూతురి పెళ్లికి లక్షల్లో సంపాదించే ఛాన్స్ తో?

Lic kanyadan Policy:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఒకటనే సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరవచ్చు. కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచాలని అనుకునే వాళ్లకు కన్యాదాన్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూతురి పెళ్లి […]

Written By: Navya, Updated On : March 6, 2022 7:00 pm
Follow us on

Lic kanyadan Policy:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఒకటనే సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరవచ్చు. కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచాలని అనుకునే వాళ్లకు కన్యాదాన్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.

తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూతురి పెళ్లి సమయానికి ఎక్కువ మొత్తం లాభం పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 150 రూపాయల చొప్పున నెలకు 4500 రూపాయల చొప్పున 22 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే పాతికేళ్ల తర్వాత ఏకంగా 31 లక్షల రూపాయలు వస్తాయి.

సంవత్సరానికి 54000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. కూతురి బర్త్ సర్టిఫికేట్‌, ఆధార్ కార్డ్, ఇతర ధ్రువపత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే పాలసీ తీసుకున్న వ్యక్తి ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్సూర్డ్ వ్యక్తికి ప్రమాదం జరిగితే ఆ వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు లభిస్తాయి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పాలసీ ద్వారా భారీస్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.