ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రూ.125 పొదుపుతో ఏకంగా రూ.27 లక్షలు..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తూపాలసీదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఉన్నవాళ్లు పాప పేరుపై పెట్టుబడి పెట్టాలని భావిస్తే జీవన్ లక్ష్య పాలసీని ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా వచ్చే పెళ్లి కోసం లేదా ఉన్నత చదువుల కొరకు వినియోగించవచ్చు. ఇతర పాలసీలతో పోలిస్తే ఈ పాలసీ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత డబ్బులు […]

Written By: Navya, Updated On : July 25, 2021 3:47 pm
Follow us on


దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తూపాలసీదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఉన్నవాళ్లు పాప పేరుపై పెట్టుబడి పెట్టాలని భావిస్తే జీవన్ లక్ష్య పాలసీని ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా వచ్చే పెళ్లి కోసం లేదా ఉన్నత చదువుల కొరకు వినియోగించవచ్చు. ఇతర పాలసీలతో పోలిస్తే ఈ పాలసీ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత డబ్బులు పొందే అవకాశంతో పాటు పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ఉన్నంత కాలం పలాసీ మొత్తంలో 10 శాతం పొందే అవకాశం ఉండటంతో పాలసీ తీసుకున్న వాళ్లకు అన్ని విధాలుగా జీవన్ లక్ష్య పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది. 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు.

పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఈ పాలసీని తీసుకున్న వాళ్లు ప్రీమియం చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సులో 25 సంవత్సరాల టర్మ్ తో పాలసీ తీసుకుంటే నెలకు 3,660 రూపాయల చొప్పున లేదా రోజుకు 125 రూపాయల చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 27 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

10 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పాలసీ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.