పీకే.. కాంగ్రెస్ కు ఓకేనా?

కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. మెల్లమల్లగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటోంది. కొత్త సమస్యలు రాకుండా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. కష్టాల్లో ఉన్న స్టేట్లలో వాతావరణం ఒక్కసారిగా దారిలో పడుతోంది. తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తాత్సారం చేసినా చివరికి మంచి నిర్ణయమే తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి తమ నిలబెట్టుకున్నారు. పంజాబ్ లోనూ నవజ్యోతి సింగ్ సిద్దూకు పీసీసీ పీఠం అప్పగించి మళ్లీ ముందడుగు వేశారు. రాజస్థాన్ […]

Written By: Srinivas, Updated On : July 25, 2021 4:24 pm
Follow us on

కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. మెల్లమల్లగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటోంది. కొత్త సమస్యలు రాకుండా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. కష్టాల్లో ఉన్న స్టేట్లలో వాతావరణం ఒక్కసారిగా దారిలో పడుతోంది. తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తాత్సారం చేసినా చివరికి మంచి నిర్ణయమే తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి తమ నిలబెట్టుకున్నారు. పంజాబ్ లోనూ నవజ్యోతి సింగ్ సిద్దూకు పీసీసీ పీఠం అప్పగించి మళ్లీ ముందడుగు వేశారు.

రాజస్థాన్ పై కూడా ఇదే ఫార్ములాను ప్రయోగించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. యువ నేత సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్ మధ్య పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్ తోపాటు పలు స్టేట్లలో అధికారాన్ని సొంతం చేసుకోలేక చతికిలపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చురుగ్గా వ్యవహరించడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రజల్లో కూడా విశ్వాసంపెరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు కదలుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో వస్తున్న మార్పులకు ప్రధాన కారణం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన సూచించిన సలహాలు, సూచనలతో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఆయన వరుసగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ పలు మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో వారు ఆయన చూపిన మార్గాలను అనుసరిస్తూ తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు., ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు రాబోయే రోజులు మంచిగా ఉంటాయని భావిస్తున్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి, పంజాబ్ లో సిద్దూ విషయంలో పీకే సూచనలు పాటించారని తెలుస్తోంది. సమస్యలను అధిగమించి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోతే రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని చెబుతున్నారు. పీకే సూచనలతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని అందరు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ గాడిన పడి విజయపరంపర కొనసాగిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.