ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.150 పొదుపుతో చేతికి రూ.20 లక్షలు..?

దెశీయ బీమా దిగ్గజ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలపై సరైన అవగాహన ఏర్పరచుకోవడం వల్ల ఏ పాలసీ మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ పాలసీనే ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ వల్ల పాలసీదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే […]

Written By: Navya, Updated On : June 8, 2021 10:43 am
Follow us on

దెశీయ బీమా దిగ్గజ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలపై సరైన అవగాహన ఏర్పరచుకోవడం వల్ల ఏ పాలసీ మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ పాలసీనే ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ వల్ల పాలసీదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు ఆర్థిక భద్రత, సేవింగ్స్ అనే రెండు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. జీవన్ లాభ్ పాలసీ తీసుకుంటే పాలసీదారుడు మరణిస్తే నామినీ పాలసీ డబ్బులు పొందే అవకాశం ఉండగా పాలసీదారుడు జీవించే ఉంటే పాలసీదారుడే ఆ డబ్బును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా జీవన్ లాభ్ పాలసీని తీసుకున్న వాళ్లు రెండు రకాల బెనిఫిట్స్ ను పొందవచ్చు.

పాలసీదారులు 16 ఏళ్లు లేదా 21 ఏళ్లు లేదా 25 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీని తీసుకోవాల్సి ఉండగా కాలపరిమితిని బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల వ్యక్తి 21 సంవత్సరాల కాలపరిమితితో పాలసీని తీసుకుంటే నెలకు దాదాపు రూ.4500 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత ఏకంగా రూ.20 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ మొత్తంలో బీమా మొత్తం రూ.10 లక్షలు, బోనస్ రూ.10 లక్షలు, ఎఫ్ఏ‌బీ రూ.లక్ష ఉంటాయి. 8 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ సదుపాయం పొందే అవకాశంతో పాటు పాలసీ తీసుకోవడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.