https://oktelugu.com/

LIC Jeevan Anand Scheme: రోజుకు రూ. 45 ఆదా చేస్తే చాలు.. రూ. 25 లక్షలు మీ సొంతం..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతీ కేటగిరీకి పాలసీలను అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 12, 2024 / 12:39 PM IST

    LIC Jeevan Anand Scheme

    Follow us on

    LIC Jeevan Anand Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురించి దాదాపు తెలియని వాారు ఉండరంటే సందేహం లేదు. బతికి ఉండగానే కాదు.. చనిపోయాక కూడా తమ కుటుంబాన్ని ఆదుకునే ఏకైక సంస్థ ఎల్ఐసీ మాత్రమే అంటే ఎంత మాత్రం సందేహం లేదు. ఇందులో కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చే పాలసీ కడితే చాలు మనం లేకున్నా కుటుంబం ఆనందంగా ఉండవచ్చు. మరణించిన తర్వాతే కాకుండా.. పాలసీ మెచ్యూర్ అయితే చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి. ఈ పాలసీలపై హోం లోన్లు, వెహికిల్ లోన్లు, స్టడీ లోన్లు కూడా తీసుకోవచ్చు. ఇలా ఎల్ఐసీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

    అయితే రోజు వారిగా తక్కువ కడితే రూ. లక్షల్లో సంపాదించి పెట్టే ఎన్నో పాలసీలు కూడా ఎల్ఐసీలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘జీవన్ ఆనంద్’ పాలసీ (ఎల్ఐసీ జీవన్ ఆనంద్). ఇందులో లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. పాలసీ పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పాలసీలో మీరు అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందవచ్చు.

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతీ కేటగిరీకి పాలసీలను అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీలు మీకు భద్రతతో పాటు పెద్ద మొత్తంలో రాబడులు ఇస్తాయి. కొన్నింటిలో తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద లాభాలను తీసుకోవచ్చు. ‘జీవన్ ఆనంద్’లో రోజూ కేవలం రూ. 45 కడితే చాలు రూ. 25 లక్షలు పొందవచ్చు.

    తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలను పొందాలంటే జీవన్ ఆనంద్ పాలసీ (ఎల్ఐసీ జీవన్ ఆనంద్) మంచి ఎంపిక. ఒకరకంగా దీన్ని టర్మ్ పాలసీ అని అనొచ్చు. పాలసీ పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పాలసీలో ఒక పథకం కింద అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను దక్కించుకోవచ్చు. ఇదే సమయంలో జీవన్ ఆనంద్ పాలసీలో లక్ష రూపాయల హామీ మొత్తం ఇవ్వబడుతుంది. అయితే గరిష్ట పరిమితి మాత్రం విధించలేదు.

    ‘జీవన్ ఆనంద్’ కింద ప్రతి రోజూ రూ .45, లేదంటే నెలకు రూ .1358 డిపాజిట్ చేస్తే రూ .25 లక్షలు ప్రయోజనం పొందవచ్చు. అయితే, మీరు ఈ మొత్తాన్ని దీర్ఘకాలికంగా ప్రతి నెలా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని పాలసీ కాలపరిమితి 15 నుంచి 35 సంవత్సరాలు, అంటే, మీరు ఈ పాలసీ కింద ప్రతి రోజూ రూ .45 పొదుపు చేస్తూ 35 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత రూ .25 లక్షల మొత్తం లభిస్తుంది. అంటే మీరు కట్టేది వార్షిక ప్రాతిపదికన పొదుపు చేసిన మొత్తాన్ని చూస్తే ఇది సుమారు రూ.16,300 అవుతుంది. అంటే పాలసీ మొత్తం పీడియడ్ లో కట్టేది రూ. 5,74,875. మెచ్యూర్ తర్వాత తీసుకునేది అదనంగా రూ. 19,25,125 గా ఉంటుంది.

    35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏం వస్తుంది?
    ప్రతీ నెల రూ.1358 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.16,300 అవుతుంది. ఈ విధంగా, 35 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ .5,70,500 అవుతుంది. 35 సంవత్సరాలు పెట్టుబడి తర్వాత, రూ .5 లక్షల హామీ మొత్తం లభిస్తుంది. దీనితో మెచ్యూరిటీ కాలం తర్వాత, మీకు రూ .8.60 లక్షల రివిజనరీ బోనస్ మరియు రూ .11.50 లక్షల తుది బోనస్ లభిస్తుంది. ఎల్ఐసీ ‘జీవన్ ఆనంద్’ బోనస్ రెండు సార్లు చెల్లిస్తుంది. దీని కోసం, మీ పాలసీ 15 సంవత్సరాలు ఉండాలి.

    ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనం?
    ‘జీవన్ ఆనంద్’ పాలసీదారులకు ఈ ప్లాన్ కింద ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనం లభించదు. కానీ మీకు నాలుగు రకాల రైడర్లు లభిస్తాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ ఉన్నాయి. డెత్ బెనిఫిట్ లో నామినీకి పాలసీలో 125 శాతం డెత్ బెనిఫిట్ లభిస్తుంది.