Viral Photo : ప్రస్తుతం సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండడంతో హీరోయిన్గా అవకాశము అందుకున్న వాళ్లు కూడా సక్సెస్ కావాలని అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోయిన్లు కెరియర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన వారే. సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేసి ఆ తర్వాత సక్సెస్ అయ్యారు చాలామంది. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లలో చాలామంది కూడా కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా అవకాశాన్ని అందుకున్న వాళ్లు ఉన్నారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాలలో సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు సినిమాలోని సైడ్ డాన్సర్ గా కనిపించింది.
Also Read : ఒకప్పుడు టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు.
ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న బ్యూటీని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు. అంతలా ఈ హీరోయిన్ మారిపోయింది. ఈమె మరెవరో కాదు తమిళ్ హీరోయిన్ సాయి ధన్సిక. 2006లో ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన కబాలి సినిమాలో ఈమె హీరో కూతురిగా నటించింది.
అందం, అభినయం కూడా ఉన్న సాయి ధన్సికాకు ఇప్పటివరకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు అని చెప్పొచ్చు. ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి. ఇక తెలుగులో సాయి ధన్సిక వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ ఈమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు అని చెప్పొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాయి ధన్సిక షేర్ చేసే ఫోటోలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ధన్సిక లేటెస్ట్ ఫోటోలను చూసి ఈమె ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు.
View this post on Instagram