LG new TV: 1990 నుంచి 2000 సంవత్సరం వరకు టీవీలకు డిమాండ్ బాగా ఉండేది. ఈ సమయంలో LG తన ఉత్పత్తులను అత్యధికంగా విక్రయించింది. ప్రతి ఇంట్లో టీవీ ఉందంటే అది LG కంపెనీదే అయి ఉండేది. అయితే స్మార్ట్ టీవీల రాకతో LG కంపెనీకి చెందిన టీవీలు తక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల అప్డేట్ చేసిన కొత్త టీవీని తీసుకురావడానికి ఈ కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ కొత్త టీవీని Consumer Electronic Control (CEC) లో ప్రవేశపెట్టడానికి సిద్ధమయింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ టీవీ ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఏర్పడింది. మరి దీని వివరాల్లోకి వెళితే..
LG కంపెనీ కొత్తగా స్క్రీన్ ను మార్చి మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది 55 నుంచి 65 అంగుళాల మోడల్లలో ఉండనుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫ్రేమ్ తో కూడిన స్లిమ్, ప్లస్ మౌంట్ డిజైన్తో కలిగి ఉంది. వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ కావాలని కోరుకుంటే ఇది కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. ఈ టీవీ యొక్క మినీ LED టెక్నాలజీ, ఆల్ఫా 7 AI ప్రాసెస్ ద్వారా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో 4కె వీడియోలను ఏఐ సౌండ్ ద్వారా వినవచ్చు.. అంతేకాకుండా ఇందులో కావాల్సిన లైబ్రరీ స్టోర్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్లు వంటివి కూడా చేర్చారు.
ప్రస్తుత కాలంలో ఎక్కువగా స్మార్ట్ టీవీ కావాలని కోరుకునేవారు ఎక్కువమంది ఉన్నారు. ఇలాంటి వారికోసం లేటెస్ట్ టెక్నాలజీతో అమర్చిన ఈటీవీ ఇంట్లో హోమ్ థియేటర్ వలే కనిపిస్తుంది. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలోని గ్యాలరీలో డిజిటల్ సినిమాలు చూడడానికి స్క్రీన్ రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే ఒక గదిలో లైట్లనుంచి వచ్చే కాంతిని తగ్గించేందుకు ఆటోమెటిగ్గా టీవీ కలర్ను పెంచుతుంది. మొత్తంగా ఒక వీడియోను స్పష్టంగా చూడడానికి ఇది సహకరిస్తుంది. ఇందులో ఉండే సెన్సార్లు టీవీలో ఉండే చిత్ర నాణ్యతను పెంచుతాయి.
ఈ టెలివిజన్ ను 2026 సంవత్సరంలో సీఈఎస్ లో ప్రదర్శించనున్నారు. ఇందులో మొత్తం 4500 కి పైగా కళాకృతులు చేర్చారు. సినిమాటిక్, గేమ్ వంటివి ఇందులో పొందుపరిచారు. అయితే దీని ధరపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రూ. 60 వేల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకా హోమ్ థియేటర్ వలే టీవీ ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అయితే 2026లో మార్కెట్లోకి తెచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం..