Homeబిజినెస్Lenovo Legion Y700 Gen 5: గేమింగ్ కోరుకునే యూత్ కోసం సూపర్ మొబైల్..

Lenovo Legion Y700 Gen 5: గేమింగ్ కోరుకునే యూత్ కోసం సూపర్ మొబైల్..

Lenovo Legion Y700 Gen 5: కొంతమంది మొబైల్లో గేమింగ్ అంటే చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త గేమ్స్ వల్ల మానసికంగా ఆనందం పొందుతారు. ముఖ్యంగా యూత్ ఇలాంటి మొబైల్స్ పట్ల ఆకర్షితులను ఎక్కువగా అవుతారు. అయితే ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా Lenovo కంపెనీ కొత్త మొబైల్ ను చైనాలో విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన సాఫ్ట్వేర్ తో పాటు మెరుగైన బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే AI ఆధారిత కెమెరా కూడా ఉండడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి కూడా ఈ మొబైల్ బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ఇంతకీ ఇందులో ఉండే ఫీచర్స్ ఎలా ఉన్నాయి? అవి ఏ రకంగా ఉపయోగపడతాయి?

ఇటీవల చైనాలో Lenovo Legion Y700 Gen 5 అనే మొబైల్ ను లాంచ్ చేసింది. ఇందులో 8.80 అంగుళాల డిస్ప్లే కనిపిస్తుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 800 nits బ్రైట్నెస్ తో ఉండే ఇందులో జూమ్ Resolution అధికంగా ఉండడంతో లాంగ్ షాట్ తీసినా కూడా ఎలాంటి నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఈ మొబైల్ లో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ అమర్చారు.24 GB రామ్, 1 TB వరకు స్టోరేజ్ ఉండడంతో ఇందులో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆదారిత యూజర్ ఇంటర్ ఫేస్ పై పనిచేసే ఇందులో AI వాయిస్ ప్రింట్ హంటర్ 2.0 సాఫ్ట్వేర్ ఉండనుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 9000 mAh బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీతో 18.8 గంటల పాటు ప్లే బ్యాక్ వస్తుంది. 10.3 గంటల గేమింగ్ కోసం వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఏమి ఆడే సమయంలో వేడిని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ కూడా మద్దతు ఇస్తుంది.

అలాగే ఈ మొబైల్లో వైఫై, బ్లూటూత్, డ్యూయల్ టైప్ సి ఫోర్స్ ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లు కలిగి ఉన్న ఈ మొబైల్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ మొబైల్ ధర రూ.54,100 తో విక్రయించే అవకాశం ఉంది. అయితే టాప్ ఎండ్ మొబైల్ రూ.81,000 గా ఉంది. ప్రస్తుతం చైనాలోని ఈ స్టోర్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీనిని కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...
Oktelugu Epaper