2025 Releasing Cars : కొత్త ఏడాది అనగానే ఎవరికైనా కొత్త ఆలోచనలు ఉంటాయి. ఇదే సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆటోమోబైల్ రంగలోని కొన్ని కంపనీలు కొత్త ఏడాది సందర్భంగా కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉంటాయి. వీటిలో కొన్నింటికి డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. మరికొన్ని రోజుల్లో 2024 ని ఇక చూడలేం. ఆ తరువాత 2025 మాత్రమే కనిపిస్తుంది. ఈ సందర్భంగా మారుతి కంపెనీ కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే 7 సీటర్ కారును అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే మారుతి నుంచి 7 సీటర్ కారు ఎర్టీగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త కారును ప్రవేశపెడుతుంది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
దేశంలోని మారుతి కంపెనీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ సామాన్యులను దృష్టిలో ఉంచుకొని కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా మారుతి నుంచి ఎటువంటి కారు రిలీజ్ అవుతుందోనని ఇప్పటికే వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి ఆశలకు అనుగుణంగా ఈ కంపెనీ నుంచి E vitara కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఇది మారుతి నుంచి రిలీజ్ అయ్యే మరో 7 సీటర్ కారు. దీనిని ముందుగా జవనరిలో ఆటోమొబలిటీ షోలో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం ఉంది.
మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ వేరియంట్ కారు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి ఈవీ అనుకోవచ్చు. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉండనున్నాయి. ఇవి 49 కిలోవాట్, మరొకటి 61 కిలోవాట్ సామర్థ్యంతో పనిచేస్తాయి. ఇవి 172 బీహెచ్పీ పవర్, 189 ఎన్ ఎం టార్క్ తో పనిచేస్తాయి. 4 డబ్లూడీ సిస్టమ్ తో పనిచేసే ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ విటారాతో పాటు హైబ్రిడ్ తో నడిచే గ్రాండ్ విటారాను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే గ్రాండ్ విటరా 7 సీటర్ పలువురిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కారు ఇప్పటికే మహీంద్రా ఎక్స్ యూవీ 700 మోడల్ కు గట్టి పోటీ ఇస్తుంది. టాయోటా అర్బన్ క్రూయిజర్ వంటి కారు కూడా ఇదే మోడల్ లో రాబోతుంది. గ్రాండ్ విటారాను రూ.15 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
ఈ రెండు కార్లతో పాటు మారుతి నుంచి ప్రాంక్స్ పేస్ లిప్ట్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇది ఫ్రాంక్స్ మాదరిగానే ఉన్నా.. అప్టేట్ ఫీచర్స్ ను చేర్చారు. 2025 ఏడాది సందర్భంగా ఈ మూడు కొత్త కార్లను మార్కెట్లోకి తసుకురానున్నారు. కొత్త కారుకొనాలని అనుకునేవారు.. అందులోనూ మారుతి కార్ల ప్రియులు ఈ కార్లు కావాలంటే బుకింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి..