Lava Republic Day Sale: పండుగలు, ప్రత్యేక దినాల్లో కొన్ని సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి నేపథ్యంలో కొన్ని వస్తువులను భారీ తగ్గింపు ధరతో అందిస్తాయి. ప్రస్తుత కాలంలో చాలామంది Online లోనే షాపింగ్ చేస్తుండడంతో కొన్ని ఈ Commerce సంస్థలు కొన్ని రోజుల్లో తగ్గింపు ధరలతో వస్తువులను ప్రకటిస్తూ ఉంటాయి. ఇవి లిమిటెడ్ పీరియడ్ తో పాటు కొంతమందికి మాత్రమే ఇచ్చే అవకాశంతో ప్రకటిస్తారు. అయితే ఈ విషయం తెలిసినవారు ఆయా వస్తువులను తక్కువ ధరకే పొందగలుగుతారు. అందువల్ల చాలామంది ఇలాంటి ఆఫర్లు ఎలా ఉన్నాయి ఎప్పుడొస్తాయని వెంటనే సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం తాజాగా Law అనే కంపెనీ రిపబ్లిక్ డే ఆఫర్ ను ప్రకటించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం ..
భారతదేశంలో ప్రతి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా దేశ రాజధాని తో పాటు దేశం మొత్తం జెండా పండుగ నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు తమ దేశభక్తిని చాటేలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మరికొందరు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థులు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నేతల రూపంలో వేషధారణలు చేస్తారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తూ ఉంటారు.
ఈ వేడుకలకు ఉత్సాహాన్ని ఇచ్చేలా కొన్ని సంస్థలు రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా Lawa అనే స్మార్ట్ ఫోన్ కంపెనీ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.ఈ కంపెనీకి చెందిన Prowatch ZN స్మార్ట్ వాచ్, Probuds 124 ఇయర్ బడ్స్ పై రెండు స్మార్ట్ ఫోన్ సంబంధించిన వాటిని కేవలం రూ.26కు మాత్రమే అందిస్తోంది. అయితే ఈ వస్తువులను లిమిటెడ్ పర్సన్స్ కు మాత్రమే అందించాలని నిర్ణయించారు. జనవరి 26 సందర్భంగా వీటికి రూ.26ను నిర్ణయించారు.
ఈ ఆఫర్ జనవరి 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి లావా స్టోర్లో ప్రారంభమవుతుంది. అందువల్ల దీనిని పొందేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలని కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా ప్రో వాచ్ సిరీస్ లోని అన్ని వేరియంట్లపై స్టాక్ ఉన్నంతవరకు ప్లాట్ 76 డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. ప్రో వాచ్ ZN స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయడానికి ప్రో వాచ్ అనే కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే Probuds కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ తో చాలామందికి ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా వీటి ధర రూ .1,000 నుంచి 3,000 వరకు ఉన్నాయి. కానీ బ్రాండెడ్ కంపెనీకి చెందిన వీటిని రూ.26 కే అందిస్తామని పేర్కొంది. ఈ విషయం తెలిసిన యూత్ చాలామంది రిప్లై చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావా కంపెనీకి చెందిన ఫోన్లో ఇప్పటికే చాలామంది వినియోగదారుల వద్ద ఉన్నాయి. ఈ కంపెనీ గుర్తింపు పొందేందుకు ఇలాంటి ఆఫర్ను ప్రకటించింది.