https://oktelugu.com/

బంగారం కొనుగోలు చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు అక్కర్లేదట..?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి లావాదేవీలు జరిపే వాళ్లు జ్యువెలరీ సంస్థలకు పాన్, ఆధార్ కార్డులను సమర్పించాల్సి ఉంది. అయితే గత రెండు రోజుల నుంచి రెండు లక్షల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసినా పాన్, ఆధార్ కార్డులను సమర్పించాలని జోరుగా ప్రచారం జరుగుతోంది. Also Read: ఎస్బీఐ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 / 08:29 AM IST
    Follow us on


    ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి లావాదేవీలు జరిపే వాళ్లు జ్యువెలరీ సంస్థలకు పాన్, ఆధార్ కార్డులను సమర్పించాల్సి ఉంది. అయితే గత రెండు రోజుల నుంచి రెండు లక్షల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసినా పాన్, ఆధార్ కార్డులను సమర్పించాలని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఈ డెబిట్ కార్డ్ తో భారీ లాభాలు..?

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వల్ల బంగారం కొనుగోలు చేసేవాళ్లు టెన్షన్ పడుతున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్త గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందించి స్పష్టతనిచ్చింది. 2 లక్షల రూపాయల లోపు లావాదేవీలకు ఎటువంటి ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే యధాతథంగా కొనసాగుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    Also Read: వాహనదారులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు..?

    నగదు ద్వారా లావాదేవీలు జరిపే బంగారం, ఇతర లోహాల కొనుగోలుదారులు మాత్రమే డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గతేడాది ఆగష్టు నెలలో 59 వేల మార్కును అందుకున్న పసిడి ధర 50,000 రూపాయల కంటే తక్కువగా ఉంది. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి వరుసగా శుభవార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గింది.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 49,763 రూపాయలుగా ఉంది. మరోవైపు గత కొన్ని రోజులుగా వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది. వెండి ధర ఏకంగా 1609 రూపాయలు తగ్గడంతో 69,718 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.