ట్రంప్ నకు షాకిచ్చిన ట్విట్టర్.. శాశ్వత నిషేధం

ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం.. ప్రధానులు.. దిగ్గజాలు, ప్రముఖులు వాడే ట్విట్టర్ సంస్థ అమెరికా అధ్యక్షుడికి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా పార్లమెంట్ పై డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు చేయడం.. దాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారానే పురిగొల్పడంతో ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. Also Read: సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ సార్? న్యాయమా? అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోతున్న తరుణంలో ట్విట్టర్ ఈ […]

Written By: NARESH, Updated On : January 9, 2021 11:14 am
Follow us on

ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం.. ప్రధానులు.. దిగ్గజాలు, ప్రముఖులు వాడే ట్విట్టర్ సంస్థ అమెరికా అధ్యక్షుడికి గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా పార్లమెంట్ పై డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు చేయడం.. దాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారానే పురిగొల్పడంతో ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది.

Also Read: సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ సార్? న్యాయమా?

అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోతున్న తరుణంలో ట్విట్టర్ ఈ గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ట్రంప్ చేసిన పనిపై అక్కడ ఎదురుగాలి వీస్తోంది. సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్ష పీఠాన్ని వీడేది లేదంటూ భీష్మించి కూర్చున్న ట్రంప్ ఇటీవలే అధికార మార్పిడికి ఒప్పుకున్నారు.

ఇప్పటికే క్యాపిటల్ భవనంలో హింసాత్మక ఘటనల పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు తీవ్రంగా స్పందించాయి. ఇప్పుడు ట్విట్టర్ సైతం నిషేధం విధించింది. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అకౌంట్ పై నిషేధాన్ని విధించి సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

ఫేస్ బుక్ ఇప్పటికే అధికార మార్పిడి పూర్తయ్యే వరకు ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ ను బ్లాక్ చేస్తూ నిషేధించింది. తాజాగా ట్విట్టర్ అయితే ఏకంగా ట్రంప్ ఖాతాను పూర్తిగా నిషేధించింది.

Also Read: బంగారం కొనుగోలు చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు అక్కర్లేదట..?

ఈ మధ్యకాలంలో ట్రంప్ ట్వీట్లను పరిశీలించామని.. ఆయన వ్యాఖ్యలు ఉద్రిక్తతలు ప్రేరేపించేలా ఉన్నాయని.. అందుకే ట్రంప్ ఖాతాను నిషేధించామని ట్విట్టర్ తెలిపింది.

దీన్ని బట్టి ఇక ట్రంప్ ఇకపై ట్విట్టర్ లో ట్వీట్లు చేయలేడు. తన వాయిస్ ను వినిపించలేడు. అమెరికాలో అధ్యక్ష మార్పిడి జరిగే లోపు ఇంకెన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయో చూడాలి మరీ.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు