Komaki Ranger Pro Bike: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్ ఒక కొత్త క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ పేరు రెంజర్ ప్రో, రెంజర్ ప్రో ప్లస్. క్లాసిక్ స్టైల్‌లో కనిపించే ఈ బైక్ లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా తయారు చేశారు. కేవలం రూ.1.30 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
ఈ బైక్‌లో 4.2 kW LiPo4 బ్యాటరీ, 5 kW హై టార్క్ మోటార్ ఉన్నాయి. ఈ వెర్షన్ సింగిల్ ఛార్జింగ్‌పై 160 కి.మీ. నుంచి 220 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. ఈ వెర్షన్ రేంజ్ మరింత ఎక్కువగా 180 కి.మీ. నుంచి 240 కి.మీ. వరకు ఉంటుంది. ఈ బైక్‌లు కేవలం 5 సెకన్లలోనే 0 నుండి టాప్ స్పీడ్‌ను అందుకుంటాయి. ఇది సిటీ రైడింగ్‌తో పాటు హైవే మీద ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే దీని రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Also Read: Big Alert for FASTag: డ్రైవర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ జేబులో పెట్టుకుంటే మీరు బ్లాకులో పడ్డట్లే
కోమాకి రెంజర్ ప్రో బైక్‌లో రైడర్‌కు మంచి ఫెసిలిటీ, సేఫ్టీని అందించే అనేక ఫీచర్లు ఉన్నాయి. దీనిలో డిజిటల్ డాష్‌బోర్డ్, క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, బ్యాక్‌రెస్ట్‌తో కూడిన సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి.
ఈ బైక్‌లో 50 లీటర్ల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, పార్క్ అసిస్ట్, ఆటో రిపేర్ స్విచ్, టర్బో మోడ్ వంటి నయా ఫీచర్లు అందించారు. వెనుక భాగంలో ప్రొటెక్షన్ గార్డ్ కూడా ఉంది. బైక్‌తో పాటు అన్ని యాక్సెసరీస్ కూడా వస్తాయి. కోమాకి రెంజర్ ప్రో ప్రారంభ ధర రూ.1.30 లక్షలు కాగా, రెంజర్ ప్రో ప్లస్ ధర రూ.1.40 లక్షలు. ఈ ధరలోనే బైక్ అన్ని యాక్సెసరీస్‌తో వస్తుంది. క్లాసిక్ క్రూయిజర్ స్టైల్‌ను ఇష్టపడేవారికి రోజువారీ వాడకానికి లో మెయింటెనెన్స్ బైక్ కావాలనుకునేవారికి ఇది ఒక మంచి ఆప్షన్.