SBI Checks: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తమ కస్టమర్ల కొరకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. చెక్ లను డిపాజిట్ చేసే మెషిన్లను ఎస్బీఐ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. కియోస్క్ లు చెక్ డిపాజిట్ల కోసం ఎలా పని చేస్తాయో ఎస్బీఐ వీడియో ద్వారా వెల్లడించింది.
ఎస్బీఐ కియోస్క్ లను అందుబాటులోకి తీసుకురావడంతో మాన్యువల్ గా చెక్ లను డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపై బ్రాంచ్ లకు వచ్చి క్యూలైన్లలో నిలబడకుండా ఎస్బీఐ ఖాతాదారులు సులువుగా చెక్ లను డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో చెక్ లను డిపాజిట్ చేసే కస్టమర్లకు చెక్ డిపాజిట్ కియోస్క్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: Janasena: జనసేనకు కొత్త రక్తం
కస్టమర్లు బ్యాంకు శాఖకు వెళ్లకుండానే చెక్ లను డిపాజిట్ చేయవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లడం ద్వారా చెక్ లను సులభంగా డిపాజిట్ చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చెక్ డిపాజిట్ కియోస్క్ మెషిన్ లో చెక్ వివరాలను నమోదు చేసి సీటీఎస్ కంప్లియెంట్ చెక్ ప్రాసెస్ చేసిన తర్వాత రశీదును పొందవచ్చు. యోనో యాప్ ను వాడటం ద్వారా చెక్ లకు సంబంధించి బల్క్ డిపాజిట్లు చేయవచ్చు.
మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచనలు చేసింది. ఎస్బీఐ ఖాతాలకు కఠినమైన పాస్ వర్డ్ లు పెట్టుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఏవైనా మోసాలు జరిగితే cybercrime.gov.in వెబ్ సైట్ కు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచనలు చేసింది.
Also Read: KCR Chinajiyar swamy : చినజీయర్ స్వామిపై ప్రతీకారం తీర్చుకున్న కేసీఆర్