Dissent In Telangana Congress: కాంగ్రెస్ అసమ్మతి నేతలకు చెక్.. పట్టుబిగించిన రేవంత్ రెడ్డి

Dissent In Telangana Congress: టీపీసీసీలో ఏం జరుగుతోంది? సీనియర్లు అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎప్పటికప్పుడు అసమ్మతి స్వరం పెంచుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నియామకం నుంచి కూడా సీనియర్ నేతలు ఆయనపై అసంతృప్తి బాణాలు వేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ భవితవ్యం గందరగోళంలో పడుతోంది. పార్టీ ముందుకెళ్లకుండా వెనకకే పోతోంది. ఫలితంగా ప్రజల్లో కూడా పార్టీకి గుర్తింపు లేకుండా పోతోంది. అయినా సరే రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తున్నారు. అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు […]

Written By: Srinivas, Updated On : March 28, 2022 10:12 am
Follow us on

Dissent In Telangana Congress: టీపీసీసీలో ఏం జరుగుతోంది? సీనియర్లు అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎప్పటికప్పుడు అసమ్మతి స్వరం పెంచుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నియామకం నుంచి కూడా సీనియర్ నేతలు ఆయనపై అసంతృప్తి బాణాలు వేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ భవితవ్యం గందరగోళంలో పడుతోంది. పార్టీ ముందుకెళ్లకుండా వెనకకే పోతోంది. ఫలితంగా ప్రజల్లో కూడా పార్టీకి గుర్తింపు లేకుండా పోతోంది. అయినా సరే రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తున్నారు. అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు తన శాయిశక్తులా కృషి చేస్తున్నారు.

Revanth Reddy

ఢిల్లీ కేంద్రంగానే సీనియర్లు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వారి కుట్రలను భగ్నం చేసే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ధీటైన జవాబు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో సీనియర్ల ఆగడాలు సాగడం లేదు. వారికి అధిష్టానం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి కుట్రలు కార్యరూపం దాల్చడం లేదు. ఇక లాభం లేదనుకుని తోకముడుచుకోవడం తప్ప చేసేదేమీ లేదని తెలుసుకుంటున్నారు.

Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి

పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలవాలని భావించినా వారికి అపాయింట్ మెంట్ దక్కలేదు. దీంతో ఏం మాట్లాడకుండా వెనకకు తిరిగి వచ్చేశారు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి కూడా సమాచారం అందుతోంది. ఎవరెవరు ఢిల్లీ వెళ్తున్నారు? ఎవరిని కలవాలని చూస్తున్నారనే దానిపై రేవంత్ రెడ్డికి పక్కా సమాచారం ఉండటంతో వారిని నిలువరించేందుకు తరుణోపాయాలు పన్నుతున్నారు.

దీంతో అసమ్మతి నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో అధిష్టానాన్నే నమ్ముకున్నారు. అసంతృప్తి నేతలను దారికి తెచ్చుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీని గాడిలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికైనా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి జవసత్వాలు నింపాలని చూస్తున్నారు. దీని కోసమే అన్ని మార్గాలను అన్వేసిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్నారు. అసమ్మతి వర్గాన్ని అడ్డుకునేందుకు ముమ్మరంగా కష్టపడుతున్నారు. మొత్తానికి ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు.

Also Read: RRR: ఎన్టీఆర్ నటనకు థియేటర్లోనే ఇలా ఏడ్చేస్తున్నారు.. వైరల్ వీడియో

Tags