Kia Seltos Vs Skoda Kushaq: వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు డిఫరెంట్ గా కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొస్తాయి. కానీ ఒక్కోసారి ఒక మోడల్ సక్సెస్ అయితే దానికి పోటీగా మరికొన్ని వస్తాయి. మార్కెట్లో కియా కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా సెల్టోస్ మిడ్ లైట్ లేటేస్టుగా అప్డేట్ అయింది. దీనికి పోటీగా స్కోడా కుషాక్ కూడా గట్ట పోటీ ఇస్తోంది. సేమ్ వేరియంట్ ను కలిగి ఫీచర్స్ ను అప్డేట్ చేసింది. ఇదే సమయంలో వోక్స్ వ్యాగన్ సైతం సేమ్ ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ మూడు ఎలా ఉన్నాయంటే.
కొత్త కియా సెల్టోస్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ తో 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. 160 పవర్ తో 253 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 17.9 కిలో మీటర్ మైలేజీ ఇచ్చేలా డిసైన్ చేసిన దీనిని స్కోడా కుషాక్ ను పోలీ ఉంటుంది. అయితే కియా విషయానికొస్తే ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన వినియోగం కూడా అధికంగా ఉంటుంది.
స్కోడా కుషాక్ వెహికిల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 150 పవర్ తో 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ డీటీసీతో 18.86 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. వోక్స్ వ్యాగన్ కూడా ఇదే ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే స్కోడా కుషాక్ కంటే ఎక్కువ మైలేజ్ అంటే 19.01 కిలోమీటర్ల మైలేజ్ ను ఇవ్వ గలదు. మైలేజ్ విషయంలో మిగతా వాటికంటే వోక్స్ వ్యాగన్ ముందుందని చెప్పొచ్చు.
స్కోడా, వోక్స్ వ్యాగన్ లు తమ టర్బో పెట్రోల్ ఇంజన్ లలో యాక్టివ్ సిలిండర్, డియాక్టివేషన్ ను అందిస్తున్నాయి. దీంతో ఇవి తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటాయి. దీంతో ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. కానీ కొత్త కియా సెల్టోస్ లో మాత్రం ఈ విషయంతో సమర్థమైంది కాదని అర్థం చేసుకోవాలి. కియా టర్బో డీటీసీ కాంబోని సెల్టోస్ టాప్ స్పెక్ HTX+GTX+, Xలైన్ వేరియంట్ లలో మాత్రమే అందిస్తుంది.