https://oktelugu.com/

Kia SUV Electric car : లాంగ్ ట్రిప్ చేసే వారికి Kia గుడ్ న్యూస్.. SUV వేరియంట్ లో ఎలక్ట్రిక్ కారు.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది లో చాలా కంపెనలు కొత్త ఈవీలను పరిచయం చేశాయి. అయితే ఎస్ యూవీ వేరియంట్ లో ఎలక్ట్రిక్ కారు కోరుకునే వారి కోసం కియా కంపెనీ కొత్తగా ఈవీ 7 సీటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2024 / 08:54 PM IST

    Kia Electric Cars

    Follow us on

    Kia SUV Electric car : దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు భారత మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన సోనెట్, సెల్టోస్, కేరెన్స్ వంటి మోడళ్లకు వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ వచ్చింది. అయితే కేవలం పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలోనూ కియా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నిస్తోంది. కియా నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈవీ 6 అమ్మకాల్లో దూసుకుపోతుంది. అయితే దీని ధరలు కాస్త ఎక్కువైనా ప్రీమియం కార్లు కోరుకునేవారికి ఇది బెస్ట్ మోడల్ అని అంటున్నారు. ఈ తరుణంలో కియా నుంచి తాజాగా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఈవీ 9ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది లో చాలా కంపెనలు కొత్త ఈవీలను పరిచయం చేశాయి. అయితే ఎస్ యూవీ వేరియంట్ లో ఎలక్ట్రిక్ కారు కోరుకునే వారి కోసం కియా కంపెనీ కొత్తగా ఈవీ 7 సీటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. ఈవీ 9 గా పేర్కొంటున్న ఈ కారులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో డిజిటల్ కీ, వైర్ లెస్ అండ్రాయిడ్ చార్జర్, యాపిల్ కార్ ప్లే, యూఎస్ బీ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 5.3 అంగుళాల త్రీ జోన్ క్లైమేంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి. కొత్త కియా కారు సేప్టీ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ రియర్ వ్యూ మిర్రర్, హీటెడ్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ పవర్ టెయిల్ ఉన్నాయి.

    కియా ఈవీ 9 లో 99.8 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండనుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 541 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఇందులో అల్ట్రా ఫాస్ట్ 800 బాట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీనిని 15 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే 239 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులోని లెవల్ 3, అడాస్ టెక్నాలజీ ఉండడం వల్ల డ్రైవింగ్ సౌకర్యం ఉండనుంది.

    ఫ్యామిలీతో లాంగ్ టూర్ వేయడానికి ఎస్ యూవీ 7 సీటర్ కోరుకుంటున్నారు. ఈ వేరియంట్ లో ఇప్పుడు కియా ఎలక్ట్రిక్ కారు తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో డిజిటల్ టైగర్ ఫేస్ అనే సిగ్నేచర్ ఆకర్షిస్తుంది. అలాగే డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్, వర్టికల్ హెడ్ ల్యాంపులు ఉన్నాయి. ఇక ప్రత్యేకమన ఎల్ ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉపయోగంగా ఉంటాయి. అన్నీ కుదిరితే ఈ కారును వచ్చే ఆక్టోబర్ లో అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే దీనిని భారత్ లో లాంచ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.