https://oktelugu.com/

Samantha : నాగ చైతన్య సినిమాలో అలాంటి పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

సమంత సమాధానం చెప్తూ 'ప్రస్తుతానికి అయితే నాకు అలాంటి ఆలోచనలు లేవు. మళ్ళీ అతనితో సినిమా చేసే అవకాశం వస్తుంది అని నేను అనుకోను. ఒకవేళ అతని సినిమాలో నటించాల్సి వస్తే విలన్ రోల్ చేస్తాను. బయట చెయ్యలేని పనులు అందులో ఆ పాత్ర ద్వారా చెయ్యొచ్చు కదా' అంటూ చెప్పుకొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 / 09:56 PM IST

    Samantha Shaking Comments On Naga chaithanya

    Follow us on

    Samantha : నాగ చైతన్య – సమంత కి విడాకులు జరిగి రెండేళ్లు అవుతుంది, కానీ ఇప్పటికీ వీళ్ళ గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక కథనం ప్రచారం అవుతూనే ఉంది. ఒక సెలబ్రిటీ జోడీ పై ఇన్ని రోజులు నాన్ స్టాప్ గా కథనాలు రావడం బహుశా వీళ్లిద్దరి విషయం లోనే జరిగింది అనుకోవచ్చు. ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత తో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి ఆమదారికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్లిద్దరి టాపిక్ లో కూడా సమంతానే ఎక్కువగా హైలైట్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు విడాకుల విషయం లో అందరూ సమంతది తప్పు అని అనుకున్నారు. ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత తో నిశ్చితార్థం చేసుకున్నాడో, అప్పటి నుండి పాత విషయాలన్నీ పరిశీలిస్తూ, నాగ చైతన్య శోభిత తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే అతనికి సమంత విడాకులు ఇచ్చింది అనే నిర్ధారణకు వచ్చేసారు.

    ఇదంతా పక్కన పెడితే సమంత బాలీవుడ్ లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ కాలేదు కానీ, కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి ఒక ఇంటర్వ్యూ లో సమంత ని అడిగిన ప్రశ్నలు లీక్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతూ ‘మీ మాజీ భర్త కూడా టాలీవుడ్ లో హీరోనే కదా..మీరిద్దరూ కలిసి గతంలో పలు సినిమాలు చేసారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతో నటించే అవకాశం వస్తే చేస్తారా?, చేస్తే ఎలాంటి పాత్ర చేస్తారు?’ అని ఆమెని అడుగుతుంది. దానికి సమంత సమాధానం చెప్తూ ‘ప్రస్తుతానికి అయితే నాకు అలాంటి ఆలోచనలు లేవు. మళ్ళీ అతనితో సినిమా చేసే అవకాశం వస్తుంది అని నేను అనుకోను. ఒకవేళ అతని సినిమాలో నటించాల్సి వస్తే విలన్ రోల్ చేస్తాను. బయట చెయ్యలేని పనులు అందులో ఆ పాత్ర ద్వారా చెయ్యొచ్చు కదా’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అంటే నాగ చైతన్య మీద ఉన్న కోపం, కసి మొత్తాన్ని నిజ జీవితంలో ఎలాగో చూపించలేదు కాబట్టి, ఇలా విలన్ రోల్ ద్వారా ఆమె పగ తీర్చుకోవచ్చు కదా అని అర్థం. మరి ఇలాంటి ప్రయోగం టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ చేస్తాడో చూడాలి. గతం లో కూడా ఒక పాపులర్ బాలీవుడ్ టాక్ షో లో ‘మీ మాజీ భర్తతో కలిసి ఒకే రూమ్ లో ఉంటే పరిస్థితి ఏమిటి’ అని అడగగా, దానికి సమంత సమాధానం చెప్తూ ‘ఆ రూమ్ లో కత్తులు మరియు ఇతర ఆయుధాలు ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమి చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాగ చైతన్య మీద కోపాన్ని వ్యక్తపర్చింది.