Kia clavis
Kia Clavis : దక్షిణ కొరియా కంపెనీ కియా కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు సెల్టోస్, సోనెట్ రిలీజ్ అయి అత్యధికంగా ప్రజాదరణ పొందించింది. అయితే ఈ కంపెనీ నుంచి క్లావిస్ రిలీజ్ కానుందనే విషయం ఇప్పటికే తెలిసిన విషయంమే. ఎస్ యూవీ సెగ్మెంట్ లో ఉత్పత్తి అవుతున్న ఈ మోడల్ త్వరలోమార్కెట్లోకి రానుంది. అయితే దీని గురించి ఇప్పటికే వివరాలు బయటకి వచ్చాయి. ఈ కారు ఫీచర్స్, స్పెషిఫికేషన్ ను చూసి షాక్ అవుతున్నారు. మరి దీని వివరాల్లోకి వెళితే..
కియా క్లావిస్ ఇంజిన్ కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ స్పెషిఫికేషన్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, అతిపెద్ద టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్స్ తో పాటు సన్ రూప్ ఆకట్టుకుంటున్నాయి. కియా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సోనెట్ తో పోల్చుకుంటే క్లావిస్ లో స్పెష్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ లో రెడీ కావడం విశేషం. అయితే ఈ రెండూ ఫ్రెంట్ వీల్ డ్రైవ్ అని సమాచారం. కేవలం భారత్ లో డ్రైవ్ చేయడానికి దీనిని అమర్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఎస్ యూవీ అనగానే రూ.10 లక్షల పైమాటే అనే భావన ఉంటుంది. కానీ కియా క్లావిస్ మాత్రం రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో అలరిస్తుంది. ఎస్ యూవీ సెగ్మెంట్ లో ఇలా తక్కువ ధరతో ఉన్న కార్లు చాలా తక్కువ. అందువల్ల ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అందులోనూ కియా కార్లకు ఎక్కవ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే క్లావిస్ గురించి మరింత ఆసక్తి మొదలైంది.
ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై మక్కువ చూపుతుండడంతో కియా కంపెనీ సైతం ఈ వేరియంట్ లో కొత్త మోడల్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటికే కియా నుంచి రిలీజ్ అయిన సోనెట్ ను ఈవీ9 పేరుతో ఇంటియాలో లాంచ్ చేయనుంది ఇప్పుడు కియా క్లావిస్ ను కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ లో నూ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే దీని గురించి వివరాలు బయటకు రావడంతో ఈ కారు కోసం వెయిట్ చేస్తున్నారు.