Shawomi Car:ప్రస్తుతం విద్యుత్ కార్ల హవా పెరిగిపోతుంది. వాతావరణ కాలుష్యం, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగిపోవడంతో వాటికి ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్, ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రకమైన కార్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. కార్ల తయారీలో చైనా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో షావోమీ తాజాగా తొలి విద్యుత్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే తయారు చేసిన ఈ కంపెనీ తాజాగా విద్యుత్ కార్లను మార్కెట్లోకి తీసుకు రావడం ఆటోమోబైల్ రంగంలో కొత్త చర్చకు దారి తీసింది. దీని వివరాలు ఎలా ఉన్నాయంటే?
షావోమి ఎలక్ట్రిక్ కారు మిగతా వాటికంటే స్పెషల్ అని చెప్పవచ్చు. దీనిని కంపెనీ సీఈవో లీ జున్ ఆవిష్కరించారు. ఎస్ యూ 7 గా వ్యవహరించే ఈ కారు మార్చి 28న చైనా మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. షావోమీ ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా నిలిచింది. ఇందులో భాగంగా ఈ కంపెనీ ఆవిష్కరించిన కారులో ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ తో అనుసంధానం అయ్యేలా రూపొందించారు.
ఈ కారులో ప్రముఖ కాన్ టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను తీసుకున్నారు. అంతేకాకుండా ఇది సెల్ టు బాడీ టెక్నాలజీతో మూవ్ అుతుంది. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు కంపెనీ సీఈవో తెలిపారు. ఇలా రెండు విభాలు అనుసంధానం కావడంతో కారు ధృఢత్వాన్ని కలిగి ఉంటుందిన అంటున్నారు. ఈ కారు ఎక్కువగా యాప్ లతో మూవ్ అవుతుంది. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
ఎస్ యూ 7 , ఎస్ యూ 7 మాక్స్ అనే రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఎస్ యూ 7 కారు 5.28 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది.ఎస్ యూ7 మ్యాక్స్ మాత్రం 2.78 సెకన్లలో టార్గెట్ ను రీచ్ చేస్తుందని చెప్పారు. ఎస్ యూ 7 ఒక్కసారి రీచార్జ్ చేస్తే 668 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం 210 కిలోమీటర్ల వరకువెల్తుంది. అదే ఎస్ యూ 7 మ్యాక్స్ ఒక్కసారి చార్జ్ చేస్తే 800 కిలో మీటర్ల వరకు వెళ్తుంది. దీన గరిష్ట వేగం 265 కిలోమీటర్ల వరకు ఉంది.