Kia Carens:దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ మే 8న దేశంలో తన పాపులర్ ఎంపీవీ కారెన్స్ అప్ డేటెడ్ మోడల్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. కొత్త మోడల్ టెస్ట్ వెహికల్ అనేక సందర్భాల్లో రోడ్ల మీద కనిపించింది. కియా కారెన్స్‌ను భారతదేశంలో మొదటిసారిగా జనవరి 2022లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ కారుకు మొదటిసారిగా పెద్ద అప్‌డేట్ లభించనుంది. కొత్త కారెన్స్‌లో భారీ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. 6-7 సీటర్ ఎంపీవీ సెగ్మెంట్‌లో కియా కారెన్స్ మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి పాపులర్ కార్లతో పోటీపడుతుంది.
Also Read : లీటరుకు ఏకంగా 34 కిమీ మైలేజ్.. రోజూ ప్రయాణించడానికి బెస్ట్ కార్లు ఇవే
2025 కియా కారెన్స్ అనేక మార్పులతో రానుంది. ఇందులో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు అన్నీ ఉంటాయి. కంపెనీ ప్రకారం.. ఎంపీవీ కొత్త డిజైన్‌తో వస్తుంది. ముందు భాగంలో మార్పులు ఉండవచ్చు. ఇది బ్రాండ్ కొత్త డిజైన్‌తో అందించనున్నారు. దీనితో పాటు బంపర్, గ్రిల్, ఇతర భాగాలకు కూడా కొత్త డిజైన్ ఇవ్వవచ్చు. అయితే కారు మొత్తం సిల్హౌట్ మునుపటిలాగే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో అల్లాయ్ వీల్స్‌తో పాటు వెనుక భాగం కోసం కొత్త డిజైన్ ఉంటుంది.
కొత్త కారెన్స్ ఇంటీరియర్
కొత్త కియా కారెన్స్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు చూడవచ్చు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ ఇంటీరియర్ లేఅవుట్ కొత్తగా ఉండవచ్చు. ఇప్పుడు ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. ఈ యూనిట్లు సిరోస్ లేదా సెల్టోస్ మాదిరిగా ఉండవచ్చు. దీనితో పాటు వెనుక ప్రయాణికుల కోసం వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఇతర ఫీచర్లు యాడ్ చేయవచ్చు.
అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు
కొత్త కియా కారెన్స్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు లెవెల్-2 ADAS ఫీచర్లు ఇవ్వనుంది.ఇప్పుడు ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి. కంపెనీ ప్రస్తుతం ఈ ఫీచర్లను సోనెట్, సెల్టోస్, సిరోస్ వంటి కొత్త కార్లలో మాత్రమే అందిస్తోంది. ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లు కారెన్స్ కొత్త మోడల్ కోసం రూ.25,000 టోకెన్ మొత్తంతో అనధికారికంగా బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించాయి.కొత్త కారెన్స్ విడుదలైన తర్వాత దాని ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ విడుదల చేయనుంది. దీని అమ్మకాలు వచ్చే కొద్ది నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ధర ఎంత ఉండవచ్చు?
2025 కియా కారెన్స్‌లో ప్రస్తుత వెర్షన్‌లో అందుబాటులో ఉన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలే ఉంటాయి. ఇందులో 1.5-లీటర్ TGDi పెట్రోల్, 1.5-లీటర్ DPFi పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. కొత్త మోడల్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర బేస్ మోడల్ కోసం రూ.10.60 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్ కియా కారెన్స్ ఎక్స్-లైన్ DCT కోసం రూ.19.70లక్షల వరకు ఉంటుంది.