Kia : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ కార్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కియా ఇండియా ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. సరికొత్త కియా కేరెన్స్ క్లావిస్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. లాంచ్ అయిన వెంటనే టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? ధర ఎంత ఉండొచ్చు? వివరంగా తెలుసకుందాం.
కియా ఇండియా తన సరికొత్త కేరెన్స్ క్లావిస్ కోసం బుకింగ్స్ మొదలు పెట్టింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు కేవలం రూ.25,000 టోకెన్ మొత్తంతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు అధీకృత డీలర్‌ల వద్ద, అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. కేవలం రెండు రోజుల క్రితమే కియా కేరెన్స్ క్లావిస్‌ను ఆవిష్కరించింది. దీని ధరను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. కేరెన్స్ క్లావిస్ కియా 6 లేదా 7 సీటర్ కారు కేరెన్స్ కంటే పై మోడల్. ఇది లాంచ్ అయిన తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా, XL6, టయోటా రూమియన్, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్‌లకు పోటీ ఇవ్వనుంది.
Also Read : ఇన్నోవా, ఎర్టిగాకు షాక్.. లక్షల్లో అమ్ముడవుతున్న కియా కారెన్స్
కియా కేరెన్స్ క్లావిస్ మొత్తం 7 వేరియంట్లలో అమ్మకాని ఉంది. అవి HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+. క్లావిస్‌లో సేఫ్టీ కోసం లెవెల్-2 ADAS వంటి సిస్టమ్ అందించబడింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, మొత్తం 18 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్‌లతో సహా 20 కంటే ఎక్కువ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్‌లు ఉన్నాయి.
3 ఇంజన్ ఆప్షన్‌లు
కొత్త కేరెన్స్ క్లావిస్‌లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (113 bhp పవర్), టర్బో పెట్రోల్ వేరియంట్ (158 bhp పవర్), 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటాయి. టర్బో పెట్రోల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌లలో కొత్త మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉంటాయి.
అత్యంత అద్భుతమైన ఫీచర్లు
కొత్త క్లావిస్ ఐవరీ సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కిల్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ వంటి అనేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్‌లో 26.62-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, ఆఫ్‌సెట్ కియా లోగో, కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. దీనితో పాటు 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, రూఫ్‌పై అమర్చిన వెంట్‌లతో సీట్-మౌంటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
Also Read : మారుతి, టయోటా 7-సీటర్ కార్లకు పోటీగా కియా కొత్త కారు!