
అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చని తాజాగా ఒక వ్యక్తి నిరూపించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి లాటరీలో ఏకంగా 4 కోట్ల రూపాయలు గెలుపొందారు. ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాల క్రితం కేరళకు చెందిన ఆంటోనీ ఒమన్ కు వెళ్లారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగంలో చేరిన ఆంటోనీ అప్పుడప్పుడూ లాటరీ టికెట్ లను కూడా కొనుగోలు చేసేవారు. అయితే చాలాసార్లు లాటరీ టికెట్ లను కొనుగోలు చేసినా అతనిని అదృష్టం వరించలేదు.
Also Read: రైలు ప్రయాణికులకు షాక్.. ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవట..?
తాజాగా ఆంటోని దుబాయ్ కరెన్సీలో 35 దిర్హామ్ లు (భారత కరెన్సీలో 700 రూపాయలు) ఖర్చు చేసి లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. అదృష్టం కలిసిరావడంతో ఆంటోనీ కొనుగోలు చేసిన టికెట్ కు 2 మిలియన్ దిర్హామ్‌ల ప్రైజ్ మనీ లభించింది. మన దేశ కరెన్సీ ప్రకారం ఆంటోనీ ఏకంగా 4 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. లాటరీ తగిలిన విషయం తెలిసి ఆంటోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈమెయిల్ ద్వారా లాటరీ నిర్వాహకులు ఈ విషయాన్ని తెలియజేయగా మొదట ఆ ఈమెయిల్ ను తాను నమ్మలేకపోయానని.. లాటరీ ద్వారా గెలిచిన డబ్బులో కొంత మొత్తంతో అప్పులు తీర్చి మిగిలిన మొత్తం భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడంతో పాటు సేవా కార్యక్రమాల కొరకు వినియోగిస్తానని ఆంటోని అన్నారు. లాటరీ విన్ కావడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆంటోని పేర్కొన్నారు.
Also Read: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న సిలిండర్ ధరలు..?
లైఫ్ లో ఇంత మొత్తాన్ని చూస్తానని తాను అనుకోలేదని లాటరీలో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడంతో ఆనందంగా ఉందని ఆంటోని అన్నారు.