కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు అమలైన తరువాత ఖర్చులు భారీగా పెరగడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 10 రూపాయలు తగ్గింది.
Also Read: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?
ప్రస్తుతం తక్కువ మొత్తమే తగ్గినా రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 2020 సంవత్సరం నవంబర్ నెల నుంచి అంతకంతకూ పెరుగుతుండటంతో మన దేశంలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదల ఆధారంగా దేశీయంగా చమురు ఉత్పత్తుల ధరలలో మార్పులు జరుగుతున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఈ నెల మార్చి మధ్య వారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తి ధరలు తగ్గుతున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది. ఢిల్లీ మార్కెట్లో చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ రిటైల్ సెల్లింగ్ ధరను లీటర్ కు 60 పైసలు, లీటరుకు 61 పైసలు తగ్గించాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.
Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?
ధరలు తగ్గడంతో ఢిల్లీ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర 819 రూపాయల నుంచి ఏకంగా 809 రూపాయలకు తగ్గింది. ఇండియన్ ఆయిల్ తీసుకున్న నిర్ణయం దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా ఉండటం గమనార్హం.