JSW MG hybrid SUV: కార్ల వినియోగదారుల అభిరుచులు, అవసరాలను బట్టి కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతుండడంతో చాలామంది వీటి తయారీ పైనే ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రముఖ కార్ల కంపెనీ JSW, MG లో కలిసి త్వరలో కొత్త కార్లు తీసుకురాబోతున్నాయి. ప్రస్తుతం చాలామంది SUV కార్ల పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో ఈ వేరియంట్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కార్లు హైబ్రిడ్ ఇంజన్ తో కలిగి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో IM6 ఎలక్ట్రిక్ SUV వెహికల్ తోపాటు స్టార్ లైట్ 560 లను ప్రారంభించింది. ఇవి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ తో ఉన్నట్లు చూశారు. ఇప్పుడు మరో రెండు కార్లను తీసుకురావడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..
JSW, MG కంపెనీలు కలిసి త్వరలో MG స్టార్ లైట్ 560 అనే కారును తీసుకురాబోతున్నాయి. SUV వేరియంటు లో ఉన్న ఇది 7 సీటర్ కారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది 106 HP, 130 NM టార్క్ ను రిలీజ్ చేయనుంది. ఈ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజన్ ను కూడా చూడవచ్చు. ఇది 20.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండనుంది. ఇది 197 bhp పవర్, 230 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఇంజన్ 9.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకో గలదు. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజన్ కలిసి 500 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ చార్జింగ్ కోసం DC ఫాస్ట్ ఛార్జ్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా 20 నిమిషాల్లోనే 30 నుంచి 40% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రెండు కంపెనీల నుంచి రాబోతున్న మరో కారు MG IM6. ఇది ఆకర్షణీయమైన డిజైన్ తో కలిగిన ప్రీమియం కారు 2025 ఆటో ఎక్స్పోలో దీనిని ప్రదర్శించారు. పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన ఈ ఎస్ యు వి కారులో 800 V ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ద్వారా రూపొందించబడింది.100 kWh బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఇది 408 Hp 500 NM టార్కును రిలీజ్ చేస్తుంది. అయితే RWD,AWD సెట ప్ తో ఇది సాధ్యమవుతుంది. అలాగే ఇందులో డ్యూయల్ మోటార్ ఉండడంతో 3.4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 396 KWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది DC చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఇందులో 23.6 అంగుళాల పనోరమిక్ స్క్రీన్, 10.5 అంగుళాల ఇన్ఫోటైమ్మెంట్ సిస్టం చూడవచ్చు. టెస్లా y వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ కారు రాబోతున్నట్లు చర్చ సాగుతోంది.