Job Loss :ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో తెలియకుండా మారింది. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి సీఈవో స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ నేటి కాలంలో జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. అయితే ఉద్యోగంలో ఉన్నంత కాలం ఖర్చులను తగ్గించుకొని ఆదాయాన్ని కూడబెటట్టుకోవడం ద్వారా జాబ్ లేనప్పుడు అవసరాలు తీరుతాయి. కానీ చాలా మంది డబ్బు సేవ్ చేయడం కుదరరు. వచ్చే ఆదాయమంతా ఖర్చులకే సరిపోతుంది. ఇలాంటి సమయంలో ఒకవేళ దురదృష్టవశాత్తూ ఉద్యోగం పోతే ఒక పని ద్వారా భారం పడకుండా చేసుకోవచ్చు. అదే పీఎఫ్.
చాలా కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు Provident Fund (PF) ను జమ చేస్తున్నాయి. ఇది ఉద్యోగుల జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి.. అదే మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఈ డబ్బులు ఉద్యోగులు రిటైర్డ్ అయిన తరువాత వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతాయని ఇలా జమచేస్తారు. అయితే నేటి కాలంలో రిటైర్డ్ అయ్యే వరకు ఒకే సంస్థలో పనిచేయడం లేదు. మధ్యలోనే జాబ్ మానేయడం ద్వారా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు జమ అయిన పీఎఫ్ మొత్తం నుంచి 75 శాతం వరకు తీసుకోవచ్చు. అయితే ఇలా డబ్బు తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఉద్యోగం పోయి నెల వరకు ఎలాంటి సంస్థలో జాయిన్ కాకపోతే వారు 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది రెండు నెలలు అయితే 80 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. EPF Act ప్రకారం సెక్షన్ 68 ప్రకారం ఒక ఉద్యోగికి ఆర్థిక భారం కాకుండా ఇలా పీఎఫ్ సంస్థలు ఆర్థికసాయం చేస్తాయి.
అందువల్ల ఉద్యోగం పోయి కొన్ని నెలల గ్యాప్ ఉంటే అప్పటి వరకు జమ చేసిన పీఎఫ్ ను విత్ డ్రా చేసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే చాలా మంది ఉద్యోగం ఉండగానే పీఎఫ్ ను డ్రా చేసుకుంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి విత్ డ్రాలకు పరిమితిని విధించారు.