జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా డేటా..?

దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఉచితంగా డేటాను పొందే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. రోజువారీ హై స్పీడ్ లిమిట్ పూర్తైన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టే విధంగా ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్లాన్‌ ను జియో ప్రకటించడం గమనార్హం. స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగగా చాలామంది తక్కువ సమయంలోనే రోజువారీ డేటా కోటాను పూర్తి చేస్తున్నారు. హై క్వాలిటీ వీడియోలను చూస్తున్న వాళ్లు డేటాను తక్కువ సమయంలోనే వినియోగిస్తూ […]

Written By: Navya, Updated On : July 3, 2021 3:06 pm
Follow us on

దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఉచితంగా డేటాను పొందే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. రోజువారీ హై స్పీడ్ లిమిట్ పూర్తైన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టే విధంగా ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్లాన్‌ ను జియో ప్రకటించడం గమనార్హం. స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగగా చాలామంది తక్కువ సమయంలోనే రోజువారీ డేటా కోటాను పూర్తి చేస్తున్నారు.

హై క్వాలిటీ వీడియోలను చూస్తున్న వాళ్లు డేటాను తక్కువ సమయంలోనే వినియోగిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఆ సమస్యకు పరిష్కారం చూపేలా జియో ప్రతి వినియోగదారుడు 1జీబీ డేటాను వెంటనే టాప్ అప్ చేసుకునే విధంగా కొత్త ప్లాన్ ను అమలులోకి తీసుకురావడం గమనార్హం. ఈ టాప్ అప్ రీఛార్జ్ కు సంబంధించిన డబ్బులను తర్వాత పే చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే జియో ఈ సౌకర్యాన్ని అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఎమర్జెన్సీ డేటా లోన్ ను పొందాలని అనుకుంటారో వారు మొదట మై జియో యాప్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరువాత మొబైల్ విభాగాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ను క్లిక్ చేసి యాక్టివేట్‌ నౌ ను ఎంచుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఈ ప్రాసెస్ ను ఫాలో కావడం ద్వారా మొత్తం ఐదుసార్లు డేటా లోన్ ను తీసుకునే సదుపాయం ఉంటుంది. ఒక విధంగా కస్టమర్లకు ఉచితంగానే డేటా లభిస్తుంది. అమౌంట్ తర్వాత పే చేసే అవకాశం ఉండటంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.