Jio Hotstar: మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం(entertainment wing) లో అతిపెద్ద విలీనం పూర్తయింది. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలుగా ఉన్న జియో (Jio), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) ఒకే గొడుగు కిందికి వచ్చాయి. గత ఏ డాది మార్చిలోనే ఈ విలీనానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఒప్పందాలు కూడా కుదిరాయి. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరి 14న విలీనం పూర్తయి.. జియో హాట్ స్టార్ (Jio hotstar) గా ఏర్పడ్డాయి. ఈ రెండు యాప్స్ ఒకే గూటికి రావడంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో గేమ్ చేంజర్ అని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలో ఉన్న కంటెంట్ మొత్తం ఒకేచోట దర్శనమిస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్లో జియోకు వంద మిలియన్, హాట్ స్టార్ కు 500 మిలియన్ డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఈ రెండు దిగ్గజ సంస్థలు జియో హాట్ స్టార్ గా మారడంతో.. మార్కెట్లో సంచలనం నమోదయింది. ” భారతీయులకు ప్రీమియం వినోదం అందించడం మా లక్ష్యం. అందువల్లే ఈ కలయిక ఏర్పడింది. ఇది వినోదరంగ పరిశ్రమలో అతిపెద్ద విలీనం. దీనివల్ల భారతీయులకు ప్రీమియం కంటెంట్ అందుబాటులోకి వస్తుందని” జియో హాట్ స్టార్ సీఈవో కిరణ్ మణి పేర్కొన్నారు.
100 లైవ్ టీవీ చానల్స్
జియో హాట్ స్టార్ లో 100 లైవ్ టీవీ చానల్స్ అందుబాటులోకి రానున్నాయి. 30 గంటలకు పైగా కంటెంట్ అందుబాటులో ఉంటుంది. సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి స్టాండర్డ్ డెఫినిషన్ (SD), హై డెఫినిషన్(HD) చానల్స్ జాబితాను పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దానితోపాటు.. క్రికెట్ అన్ని మ్యాచ్లు.. స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలు కనిపించవు. అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లు మొత్తం డిస్నీ + హాట్ స్టార్ కు షిఫ్ట్ అవుతాయి. త్వరలో జరిగే ఐపీఎల్ తో పాటు, ఇండియాలోని అన్ని క్రికెట్ మ్యాచ్ డిజిటల్ ఆకులను జియో సినిమా సొంతం చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అన్ని ఐసిసి టోర్నీల హక్కులను దక్కించుకుంది.. అయితే వీటన్నింటినీ ఇకపై జియో హాట్ స్టార్ లో చూసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. మార్కెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ముందుగానే హాట్ స్టార్ ను జియోలో విలీనం చేయాలని భావించారు.. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ విభాగాలలో వేరువేరుగా ఓటీటీ (OTT) లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ జియో సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విలీనం చేయాలని భావించారు. దానిని కార్యరూపం దాల్చేలాగా చేశారు.
సబ్ స్క్రైబ్ ప్లాన్ లు(మొబైల్) ఇలా
సాధారణ ప్లాన్..
మూడు నెలలకు రూ.149
సంవత్సరానికి రూ.499
సూపర్ కేటగిరీలో
మూడు నెలలకు రూ.299
సంవత్సరానికి రూ.899
ప్రీమియం కేటగిరీలో
మూడు నెలలకు రూ.499
సంవత్సరానికి రూ.1,499