Jeff Bezos
Jeff Bezos: టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో తన అగ్రస్థానం కోల్పోయారు. ఆయన ర్యాంకు రెండో స్థానానికి పడిపోయింది. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తితో పోలిస్తే సంపదలో కాస్త వెనుకడ్డాడు. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా అమెజాన్ చీఫ్ నిలిచారు. ఆయన సంపద ఎంత.. టాప్ టెన్‌లో ఎవరు ఉన్నారు అనే వివరాలు తెలుసుకుందాం.
చాలా రోజుల తర్వాత కొత్త వ్యక్తి..
ప్రపంచ కుబేరుడిగా చాలా కాలంగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. 9 నెలలకుపైగా అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా ఆయన స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చారు. మస్క్ ఒకస్థానం పడిపోయి రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచి ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
పతనమైన టెస్లా షేర్లు..
సోమవారం మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనం అయ్యాయి. పెద్దమొత్తంలో ఆయన సంపదను కోల్పోయారు. ఒక్కరోజే ఈ స్టాక్ ఏకంగా 7.16 శాతం పడిపోయి 188.14 యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో టెస్లా మార్కెట్ విలువ భారీగా పతనమై.. ఇదే క్రమంలో మస్క్ సంపద కూడా మంచులా కరిగిపోయింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం..
తాజాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ఇప్పుడు జెఫ్ బెజోస్ సందప 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ.16.58 లక్షల కోట్లు. అదే మస్క్ సంపద 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.16.41 లక్షల కోట్లు. ఇద్దరి సంపాదనలో పెద్దగా వ్యత్యాసం లేదు. అమెజాన్ షేర్లు పుంజుకోవడం, టెస్లా షేర్లు పడిపోవడం కారణంగానే ఇద్దరిస్థానాలు తారుమారయ్యాయి.
2021 తర్వాత మళ్లీ..
అమేజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ చివరిసారిగా 2021లో చివరిసారిగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. మళ్లీ ఇన్నేళ్లకు మొదటి స్థానం చేరుకున్నారు. ఒక దశలో వీరి సంపాదనలో వ్యత్యాసం 142 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాతి కాలంలో అమేజాన్ షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి. 2022 నుంచి అమెజాన్ షేర్లు ఏకంగా రెట్టింపు అయ్యా. ఈ క్రమంలోనే రికార్డు గరిష్టాలకు చేరగా మరోవైపు టెస్లా స్టాక్ 2021 నుంచి గరిష్టంగా 50 శాతం పడిపోయింది.
పడిపోతున్న ర్యాంకు..
కొన్నేళ్లుగా ఎలాన్ మస్క్ తన టాప్ ర్యాంకును లూఏయీస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సహా బెజోస్‌కు కోల్పోతూనే ఉన్నారు. కానీ ఎక్కువకాలం మస్క్ ర్యాంకులో కొనసాగుతున్నారు. బెజోస్ 2017లో తొలిసారి మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్‌ను దాటి తొలిస్థానానికి చేరుకున్నారు. 2021లో మస్క్ ఆ స్థానం ఆక్రమించారు. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న ఆర్నాల్ట్ సంపద 197 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచ కుబేరుల జాబితా..
ప్రపంచ కుబేరుల జాబితా పరిశీలిస్తే 179 బిలియన్ డాలర్ల సంపతతో మోటా చీఫ్ జూకర్ బర్గ్ నాలుగో స్థానంలో, 150 బిలియన్ డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 143 బిలియన్ డాలర్లతో స్టీవ్ బామర్, 133 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్, 129 బిలియన్ డాలర్లతో లారీ ఎలిసన్, 122 బిలియన్ డాలర్లతో లారీ పేజ్, 116 బిలియన్ డాలర్లతో సెర్జీబ్రిన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్‌కు చెందిన ముఖేష్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు. 104 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 12వ స్థానంలో కనసాగుతున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Jeff bezos has surpassed elon musk to become the richest person in the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com