Homeఆంధ్రప్రదేశ్‌Arava Sridhar latest video controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మరో వీడియో.. మరో బాంబు...

Arava Sridhar latest video controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మరో వీడియో.. మరో బాంబు పేల్చిన బాధితురాలు

Arava Sridhar latest video controversy: ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన చెందిన రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అవర శ్రీధర్‌ ఇష్యూ ఎపిసోడ్‌లవారీగా కొనసాగుతోంది. వరుసగా వీడియోలు రిలీజ్‌ చేస్తూ సంచలనం చేపుతోంది బాధితురాలు. తాజాగా మరో వీడియో బాంబు పేల్చింది. ఈ వీడియో విడుదల చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. అమాయకుడు కాదు.. మాయగాడు.. అరవ శ్రీధర్‌ అమాయకుడని ఆయన అనుచరులు, జనసేన నేతలు చేస్తున్న ప్రచారంపై వీణ స్పందించారు. కన్నంపల్లి ప్రసాద్‌ వీణకు అవర శ్రీధర్‌ గురించి […]

Arava Sridhar latest video controversy: ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన చెందిన రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అవర శ్రీధర్‌ ఇష్యూ ఎపిసోడ్‌లవారీగా కొనసాగుతోంది. వరుసగా వీడియోలు రిలీజ్‌ చేస్తూ సంచలనం చేపుతోంది బాధితురాలు. తాజాగా మరో వీడియో బాంబు పేల్చింది. ఈ వీడియో విడుదల చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది.

అమాయకుడు కాదు.. మాయగాడు..
అరవ శ్రీధర్‌ అమాయకుడని ఆయన అనుచరులు, జనసేన నేతలు చేస్తున్న ప్రచారంపై వీణ స్పందించారు. కన్నంపల్లి ప్రసాద్‌ వీణకు అవర శ్రీధర్‌ గురించి మెస్సేజ్‌ పెట్టాడు. అమాయకుడు అని పేర్కొన్నాడు. మహిళలతో తప్పుడుగా వ్యవహరించే వాడు అమాయకుడా అని ప్రశ్నించారు. రోజుకో మహిళను అనుభవించాలనుకునేవాడు అమాయకుడా అని నిలదీశారు. తన తల్లి.. తనకు అన్నం పెట్టే యజమాని భార్య ప్రైవేటు పార్ట్స్‌ గురించి మాట్లాడేవాడు అమాయకుడా అని నిలదీసింది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే మహిళలను కూడా అరవ శ్రీధర్‌ తప్పుడుగా చూస్తాడని వీణ ఆరోపించిది.

హనీట్రాప్‌ పై ఆగ్రహం..
తాను హనీట్రాప్‌ చేసినట్లు చేస్తున్న ప్రచారాన్ని వీణ ఖండించారు. హనీట్రాప్‌కు ఏడాదిన్నర సమయం అవసరం లేదని తెలిపారు. తాను సపోర్టు చేశాను కాబట్టే ఏడాదిన్నరగా అరవ శ్రీధర్‌ ఆగడాలు సాగాయన్నారు. తన వద్ద అనేక సీక్రెట్‌లు ఉన్నాయని, వాటిని కోర్టులోనే చెప్పాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇక తానే చేస్తున్నది రాజకీయ కుట్ర అనుకుంటే నన్ను చంపే హక్కు మీకు ఇస్తున్నా అని బాధితురాలు సవాల్‌ విసిరారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివాద నేపథ్యం
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపులు, మోసపూరిత అత్యాచార ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. దళిత ఉద్యోగిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త వీడియోతో కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది. శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచింది. విచారణ తేలే వరకు విప్‌ పదవి బాధ్యతల నుంచి తొలగించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఆదేశించారు. మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper