https://oktelugu.com/

Italian Luxury Car: భారత్ మార్కెట్లోకి ఇటాలియన్ లగ్జరీ ఈవీ.. ధర చూస్తే గుండెలు బాదుకుంటారు..

లగ్జరీ కార్లను తయారు చేయడంలో లంబోర్ఘిని ప్రత్యేకత చాటుకుంటుంది. భారత మార్కెట్లో లంబోర్ఘిని కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే దీని నుంచి వెలువడిన ఎటువంటి కారు అయినా ఇక్కడికి తీసుకొస్తారు. లేటేస్ట్ గా అందుబాటులకి వచ్చిన ‘ఉరుస్ ఎస్ ఈ’ డిజైన్ పాత ఉరుస్ మోడల్ గానే ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 10, 2024 / 11:32 AM IST
    Italian Luxury Car

    Italian Luxury Car

    Follow us on

    Italian Luxury Car: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. వినియోగదారులు ఎక్కవ శాతం ఈవీలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త విద్యుత్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఉత్పత్తి చేసుకున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లు భారత్ మార్కెట్ ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విద్యుత్ కారు రిలీజ్ అయింది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన కారు. ఇటలీకి చెందిన లంబోర్ఘిని నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు వచ్చాయి. వీటిల్ ‘ఉరుస్’ అనే మోడల్ ను గత ఏడాది మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘ఉరుస్ SE’ని ప్రవేశపెట్టారు. ఈ మధ్య చాలా కంపెనీలు ఈవీలను తీసుకురావడంలో బిజీ అయ్యాయి. అయితే కొన్ని కంపెనీలు కొత్త ఈవీలను తయారు చేస్తుండగా..మరికొన్ని మాత్రం ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ మోడల్ ను ఈవీగా మారుస్తున్నారు. ఇప్పుడు లంబోర్ఘిని సైతం ఇప్పటి వరకు ఉన్న ఉరుస్ ను.. ఉరుస్ ఎస్ ఈగా మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి ఈవీ రావడం ఇదే మొదటి సారి. ఇందులో పాత ఉరుస్ లో ఉండే కొన్ని ఫీచర్స్ ఉన్నా..మరికొన్నింటిని అప్డేట్ చేశారు. మరి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

    లగ్జరీ కార్లను తయారు చేయడంలో లంబోర్ఘిని ప్రత్యేకత చాటుకుంటుంది. భారత మార్కెట్లో లంబోర్ఘిని కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే దీని నుంచి వెలువడిన ఎటువంటి కారు అయినా ఇక్కడికి తీసుకొస్తారు. లేటేస్ట్ గా అందుబాటులకి వచ్చిన ‘ఉరుస్ ఎస్ ఈ’ డిజైన్ పాత ఉరుస్ మోడల్ గానే ఉంటుంది. అయితే ఇందులో బానెట్ డిజైన్ ను మార్చారు. ఇందులో హెడ్ లైట్లు, చిన్నవిగా ుంటాయి. డీఆర్ఎల్ మునుపటి దానితో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వెనుక ఉన్న టెయిల్ టైల్స్ ఆకర్షిస్తాయి. ఏరోడైనమిక్స్ పరంగా మెరుగ్గా ఉండనుంది.

    ఈ కారులో 25.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీంతో 189 బీహెచ్ పీ పవర్ తో పాటు 48.3 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఉరుస్ ఎస్ ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ తో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ను కూడా కనుగొనవచ్చు. ఈ నేపథ్యంలో ఈవీ మోడ్ లో 312 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్లగ్ ఇన్ ఇంజిన్ 620 బీహెచ్ పీ పవర్, 800 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా ఇది ట్విన్ టర్బో మోటారుగా పనిచేస్తుంది.

    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఈ ఇన్నర్ లో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ కనిపిస్తుంది. క్యాబిన్ లో అప్డేటేడ్ ఎయిర్ వెంట్స్, అల్యూమినియం యాక్సెంట్స్, డ్యాష్ బోర్డ్ వంటివి ఉన్నాయి. 12.3 డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి. ఇకది ఇది 7 డ్రైవ్ మోడ్స్ తో పనిచేస్తుంది. ఉరుస్ ఎస్ ఈని రూ.4.57 కోట్ల ప్రారంభ ధరతో విక్రియించడానికి రెడీగా ఉన్నారు. ప్రపంచ ఆటోమోబైల్ మార్కెట్లతో భారత్ పోటీ పడుతున్నందున దీనిని భారత్ లో ప్రవేశపెట్టారు.