https://oktelugu.com/

Income Tax : కారు కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా? ఎలా?

ట్రావెల్ ఏజెన్సీ నడిపేందుకు వాహనాలు కొంటారు. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు ద్వారా ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా? అని చాలా మందికి సందేహం ఉండేది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం లోన్ ద్వారా కారు కొనుగోలు చేసిన వారు కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను మినహాయింపు కింద చేర్చుకోవచ్చు. అదెలాగో ఈ కిందికి వెళ్లి చూడండి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 1:48 pm
    Income Tax

    Income Tax

    Follow us on

    Income Tax : నేటి కాలంలో కారు నిత్యావసరంగా మారిపోతుంది. దీంతో చాలా మంది సొంత వాహనాన్ని కలిగి ఉంటున్నారు. అయితే కారు కొనేంత బడ్జెట్ అందరి వద్ద ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో లోన్ ద్వారా కారు కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది కార్యాలయ అవసరాలతో పాటు విహార యాత్రలకు వెళ్లడానికి కారును కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు ట్రావెల్ ఏజెన్సీ నడిపేందుకు వాహనాలు కొంటారు. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు ద్వారా ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా? అని చాలా మందికి సందేహం ఉండేది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం లోన్ ద్వారా కారు కొనుగోలు చేసిన వారు కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను మినహాయింపు కింద చేర్చుకోవచ్చు. అదెలాగో ఈ కిందికి వెళ్లి చూడండి..

    సాధారణంగా గృహ రుణం తీసుకుంటే.. దీని ఈఎంఐ ని ఆదాయపు పన్ను కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఇలా మొత్తం రూ.3 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుంది. కానీ కారు రుణం తీసుకున్నవారికి కూడా ఈ అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కారు కొనుగోలు చేసిన వారు.. తమ కారును అద్దె ఖర్చుకింద చూపించొచ్చు. ఉదాహరణకు ఇంజనీర్లు, డాక్టరు, లాయర్లు తాము ఆదాయపు పన్నును చెల్లించేవారైతే పన్ను మినహాయింపు కింది కారు ఖర్చును చేర్పించుకోవచ్చు. ఒకవేళ కారును బ్యాంకులోన్ పై కొనుగోలు చేస్తే దీని వడ్డీని కూడా ఆదాయపు పన్ను కింద చేర్చవచ్చు.

    ఇవే కాకుండా కారును ట్రావెల్ ఏజెన్సీ కోసం ఉపయోగిస్తున్నట్లయితే వడ్డీతో పాటు ఇంధన ఖర్చులు, నిర్వహణ ఖర్చులను కూడా ఆదాయపు పన్ను ఖర్చుల్లో చేర్చవచ్చు. కొరు విలువ ఎప్పటికీ ఒకే మాదిరిగా ఉండదు. దీనిని ఉపయోగించడం ద్వారా తరుగుదల ఉంటుంది. ఈ తరుగుదలను కూడా ఆదాయపు పన్ను రిటర్న్స్ లో చేర్చవచ్చు. కారు తరుగుదలను 15 నుంచి 20 శాతం వరకు చేర్చేందుకు అవకాశం ఉంది.

    కొత్తగా కారు కొనుగోలు చేసిన వారికి సైతం కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయం రూ.10 లక్షలు ఉంటే ఇందులో కారు వడ్డీ కోసం రూ.70 వేల వడ్డీ చెల్లిస్తున్నారనుకోండి.. ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్నులో మినహాయింపు ఉంటుంది. ఇవే కాకుండా ఇంధనం, ఇతర ఖర్చులు కలిపి మరిన్ని ఖర్చులు చేర్చవచ్చు. ఇలా దాదాపు రూ. లక్ష వరకు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది. ఆదాయపు పన్నును రెగ్యులర్ గా చెల్లించే వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా అదనపు పన్ను భారం తగ్గుతుంది.

    అయితే ఇదే అదనుగా కొందరు ఆదాయపు రిటర్న్స్ చూపించుకునేందుకు కావాలనే ఖర్చులు చూపిస్తుంటారు. కానీ తప్పుడు క్లెయిమ్ చేయడం వల్ల బారీగా జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద సమాచారం తప్పుగా ఇవ్వడం వల్ల ఒక్కోసారి జైలు పాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల సరైన ధ్రువపత్రాలు అందించి నిజాయితీగా ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోండి..