Petrol: పెట్రోల్‌ రూ.100కు బదులు రూ.110 పెట్రోల్‌ కొట్టిస్తే లాభమా.. నిజమెంత?

పెట్రోల్‌ నింపడం నిజంగా సరైనదేనా? ఇదే ప్రశ్నను ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ కోరాలో చాలా మంది అడిగారు. దీనిపై రైల్వే మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ అనిమేష్‌ కుమార్‌ సిన్హా స్పందించారు. కీలక విషయాలను పంచుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : December 20, 2023 11:38 am

Petrol Price Today

Follow us on

Petrol: మన చాలా మంది పెట్రోల్‌ బంక్‌కి వెళ్లినప్పుడు రౌండ్‌ ఫిగర్‌లో ఆయిల్‌ కొట్టించుకునేందుకు ఇష్టపడరు. 100కి బదులు 110, 500కి బదులు 501, వెయ్యికి బదులు 1010 చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మోసపోవడానికి అవకాశం ఉండదని.. కచ్చితమైన పరిమాణంలో ఆయిల్‌ వస్తుందని భావిస్తుంటారు. మరి ఇందులో నిజమెంత? 100కు బదులుగా రూ.120తో పెట్రోల్‌ నింపడం నిజంగా సరైనదేనా? ఇదే ప్రశ్నను ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ కోరాలో చాలా మంది అడిగారు. దీనిపై రైల్వే మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ అనిమేష్‌ కుమార్‌ సిన్హా స్పందించారు. కీలక విషయాలను పంచుకున్నారు.

కోడ్‌ సెట్టింగ్‌..
వినయోగదారులు తెలివైన పని చేస్తున్నారనుకుంటే.. పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు అంతకనా తెలివిగా కస్టమర్లను ఓలా బురిడీ కొట్టొచ్చని ఆలోచన చేస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లో ఎక్కువ మంది ఏ పరిమాణాల్లో పెట్రోల్‌ కొట్టించుకుంటున్నారో.. అందుకు తగినట్లుగా కోడ్‌ చేసేసి ఉంచుతున్నారు. చాలా మంది 100, 200, 500, 1000 రూపాయాల్లో పెట్రోల్‌ కొట్టించుకోవడంతో.. ఈ అంకెలతోనే మెషీన్‌లో కోడ్‌ సెట్‌ చేస్తారు. అలా కాకుండా 110, 210, 510, 1010 కొట్టించుకుంటే ఆ ధరల కోడ్‌ సెట్‌ చేస్తారు.

నంబర్‌ ఎంటర్‌ చేయకుండా..
అంకెల ఎంట్రీ కోసం బటన్‌ సిస్టమ్‌ ఉంది. పెట్రోల్‌ ఫిల్లర్‌కు ఇది ఈజీగా ఉంటుంది. పదే పదే మొత్తం నంంబర్లను ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మనలో చాలా మంది.. పెట్రోల్‌ పంప్‌లో సెట్టింగ్స్‌ చేశారని.. తక్కువ నూనె లభిస్తుందని భావిస్తుంటారు. వాస్తవానికి.. ఆయిల్‌ను లీటర్లలో ఇచ్చేందుకు పెట్రోల్‌ పంప్‌ యంత్రాన్ని డిజైన్‌ చేస్తారు. సాంకేతికంగా దీనిని ఫ్లో మీటర్‌ అని పిలుస్తారు. ఎన్నిలీటర్లకు ఎంత డబ్బు అవుతందనేని సాఫ్ట్‌వేర్‌ ద్వారా లెక్కిస్తారు. అంటే ముందు లీటర్లు లెక్కించి..దానిని రూపాయాల్లోకి మార్చుతారు. లీటర్లలో కాకుండా.. 100, 110, 120 రూపాయాల్లో పెట్రోల్, డీజిల్‌ కొట్టిస్తే.. లెక్కింపులో కొన్ని పాయింట్లు పరిగణలోకి రావు. ఉదాహరణకు 1.24 లీటర్లు రావాల్సిన చోట..1.2 లీటర్ల ఆయిలే రావొచ్చు. అలాంటప్పుడు 0.04 లీటర్ల ఆయిల్‌ నష్టపోయినట్లే..!

రౌండ్‌ ఫిగర్‌తోనే లాభం..
100, 200 వంటి రౌండ్‌ ఫిగర్లో కాకుండా… 110, 120 ఆయిల్‌ తీసుకోవడం వల్ల.. మీరు ఎక్కువ ఆయిల్‌ పొందుతారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మీకు అక్యురేట్‌గా ఆయిల్‌ కావాలంటే..రూపాయాల్లో కాకుండా.. లీటర్ల ప్రకారమే కొట్టించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లీటర్లలో కొట్టించుకుంటే చిల్లర సమస్య వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇప్పుడు అంతటా డిజిటల్‌ పేమెంట్స్‌ నడుస్తున్నాయి. అందువల్ల మీరు లీటర్లలో ఆయిల్‌ కొట్టించుకొని.. దానికి ఎంత అమౌంట్‌ అయితే.. ఆ డబ్బును ఫోన్‌ పే, గూగుల్‌ పే చేయవచ్చు.