spot_img
Homeబిజినెస్iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త...

iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్..

iQOO Z11 Lite 5G:  ప్రస్తుతం చాలా మంది ఫోన్ కొనే సమయంలో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ మన్నిక గల బ్యాటరీ ఉన్న ఫోన్ ధరలు అధికంగా ఉంటున్నారు. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ వీటిని కొనలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ మొబైల్ కంపెనీ iQOO తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ వచ్చే మొబైల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో చూద్దాం..

ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ iQOO తరువాత వచ్చే బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ ‘iQOO Z11 Lite 5G’ ని భారత మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. జూలై 24 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రత్యేక ల్యాండింగ్ పేజీని కూడా ప్రత్యక్షం చేసింది.

iQOO Z11 Lite 5G హెచ్‌డి ప్లస్ 6.74 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఫోన్ భద్రత కోసం ఐపి65 ఉండడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది బడ్జెట్ శ్రేణిలో రోజువారీ పనులు, గేమింగ్‌కు మంచి పనితీరును అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత Funtouch OS తో రానుండటం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఫొటోగ్రఫీ కోసం ఈ మొబైల్ లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP లేదా 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ యొక్క మరొక ప్రధాన ఆకర్షణ బ్యాటరీ. ఇందులో 6,500mAh బ్యాటరీ ఉండడంతో రోజంతా నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేయనుంది.

ఈ 5G ఫోన్‌ను కంపెనీ రూ. 20,000 లోపు ధరతో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ మరియు 5G కనెక్టివిటీ కోరుకునే వినియోగదారులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...
Oktelugu Epaper
Exit mobile version