Realme P4x 4G: ప్రస్తుత కాలంలో మొబైల్ కొనాలని అనుకునేవారు బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారి కోసం Realme సంస్థ మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ఊహించని రేంజ్ ఫీచర్లతో సరికొత్త P4x 4G అనే స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయింది. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించే యూజర్లను ఇది బాగా సరిపోతుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Realme P4x 4G అనే ఈ స్మార్ట్‌ఫోన్ లోని అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ. ఎందుకంటే ఇందులో 8000 mAh భారీ టైటాన్ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఇలాంటి ఫోన్లలో 5000 లేదా 6000 mAh బ్యాటరీలు చూస్తుంటాం. ఈసారి కంపెనీ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చడం విశేషం. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు.
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఆటోఫోకస్ సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. ఇది పగటిపూట లేదా తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన, నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది.
ఈ ఫోన్ లో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లేను చూడొచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రావడం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ తో పాటు గేమింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు మరియు సాధారణ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI తో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఫోన్ కిందపడినా తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఆర్మోర్‌షెల్ ప్రొటెక్షన్ మరియు ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర MYR 799 గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 16,500 నుంచి రూ. 18,200 వరకు ఉంటుంది.
