iQOO Neo 10 features: ప్రస్తుతం కాలంలో మొబైల్ డిస్ ప్లే గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది టీవీల్లో కంటే మొబైల్స్ లోనే మూవీస్ చూస్తున్నారు. అలాగే గేమింగ్ కోరుకునేవారు డిస్ ప్లే పెద్దదిగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ డిస్ ప్లే కూడా కచ్చితమైన రంగులతో నాణ్యంగా ఉంటే యూత్ ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఇంప్రెస్ చేసేందుకు కంపెనీలో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా iQOO నుంచి neo 10 మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఇంది అందుబాటులోకి రానుంది. అయితే ఇందులోని డిస్ ప్లే కొందరు వెరే లెవల్ అని అంటున్నారు. మరి ఇందులో డిస్ ప్లే తో పాటు ఫీచర్స్, బ్యాటరీ పనితీరు ఎలా ఉందో చూద్దాం..
iQOO Nio 10 మొబైల్ గత ఏడాదిలో మే నెలలో మార్కెట్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న మొబైల్స్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఎందుకంటే ఇందులో ఉన్న డిస్ ప్లే యూత్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లే ఉంది. ఇది 1.5 కే రిజల్యూషన్ తో పాటు 5500 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. అలాగే 4320 అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ PWM ఉండడంతో అద్భతమైన అనుభూతిని పొందవచ్చు.
ఈ మొబైల్ లో కెమెరా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 మెగా పిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరాను ఉంచారు. అలాగే 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తూ సోనీ ఎలివేట్ 600 సెన్సార్ ను అందిస్తుంది. ఈ కెమెరాతో సోషల్ మీడియా కంటెంట్లు సృష్టించేవారికి అనుగుణంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి డస్ట్ లేకుండా చూడడానికి స్ల్పాష్ రిమూవర్ గా ఐపీ65 రేటింగ్ తో పనిచేస్తుంది. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పని చేస్తుంది. ఇందులో 7000mAh బ్యాటరీని చేర్చారు. ఇది 120 W ఫాస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. ఇది 36 నిమిషాల్లనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. అలాగే ఇది 44 వాట్ UFCS ఫ్యూజన్ ఛార్జింగ్ కు కూడా సఫోర్టుగా ఉంటుంది.
స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉండే ఇందులో 8 జీబీ నుంచి 16 జీబీ వరకు ర్యామ్ సపోర్టుగా ఉంటుంది. స్టోరేజ్ కోసం 512 జీబీ UFS 4.1 వరకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందులో యూఎస్ బీ టైప్ సీ పోర్టుతో పాటు స్టీరియో స్పీకర్లు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ ధర రూ.33,999 నుంచి రూ. 40,999 వరకు విక్రయిస్తున్నారు. ఇది వచ్చే జూన్ నుంచి అందుబాటులో ఉండనుంది. దీనిని ఎస్ బీఐ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.2,000 స్పాట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటే 6 నెలల వరకు నో కాస్ట్ తో పొందవచ్చు.