Government Shares : ఈ ప్రభుత్వ షేర్ల గురించి తెలుసా? ఇందులో డబ్బు పెడితే రెట్టింపు రాబడి..

త్వరలో ఈ షేరు ధర రూ.3000 దాటుతుందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. మరో వైపు మార్కెట్ లో ఈ షేర్ల ట్రేండింగ్ భారీగానే జరుగుతోంది.

Written By: NARESH, Updated On : May 22, 2024 9:12 pm

government shares

Follow us on

Government Shares : స్టాక్ మార్కెట్ పై కనీస అవగాహన ఉన్నా.. ఊహించని రీతిలో డబ్బు సంపాదించవచ్చు. ఏ షేరు ఎంత మేరకు పెరుగుతుంది. ఏ షేరును ఎంతకు అమ్మాలి.. లేదంటే కొనాలి.. అనే కనీస నాలెడ్జ్ ఉంటే చాలు డబ్బు మీ వెంట వస్తుంది. అయితే, షేర్ మార్కెట్ లో చాలా వరకు ప్రైవేట్ షేర్లు మాత్రమే ర్యాలీ చేస్తుంటాయి. కానీ ప్రభుత్వ షేర్లు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కొందరికి ఊహించ లాభాలు సంపాదించి పెడతాయి. అందరికీ అదృష్టం దక్కకపోయినా కొంత మందిని మాత్రం ఇది వరిస్తుంది. వాళ్లు కొన్న షేర్లతో సునామీలా డబ్బు వెంట పడుతుంది. మార్కెట్‌లో అలా ధారాళంగా డబ్బు సంపాదించిన ఇన్వెస్టర్లు చాలా మంది ఉన్నరంటే అతిశయోక్తి కాదు.

కొన్ని మల్టీ బ్యాగర్ షేర్లు ఇన్వెస్టర్ల పెట్టే డబ్బును అమాంతంగా పెంచుతాయి. ఆ కేటగిరీలో భారత ప్రధాన రక్షణ రంగ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఉంది. అదే ‘మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్’ (Mazagon Dock Shipbuilders). మూడేళ్ల కాలంలో చూస్తే ఈ షేర్లు దిమ్మతిరిగే రిటర్న్స్ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి చెందిన కంపెనీలకు విపరీతమైన ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ప్రభుత్వ చర్యతో దేశీయ డిఫెన్స్ సెక్టార్ కంపెనీ దిన దినం లాభపడుతున్నాయి. ఇది చూసి ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు.

ఇదే డిఫెన్స్ రంగానికి చెందిన ‘మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్’ స్టాక్ మూడేళ్ల కాలంలో ఊహించని రిటర్న్స్ సంపాదించి పెట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో షిప్‌యార్డ్స్ నిర్వహించే ఈ కంపెనీ కొత్త షిప్పుల తయారీ, మరమ్మతులు, సబ్ మెరైన్స్, వివిధ రకాల వెసల్స్ సంబంధిత ఇంజినీరింగ్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఈ కంపెనీ స్టాక్ 2020, అక్టోబర్ లో స్టాక్ మార్కెట్ లో రూ.145 తో లిస్ట్ అయ్యింది. ఈ ధరతో పోలిస్తే ఇప్పటికే ఈ షేరు ధర 1900 శాతం పెరిగింది. అంటే లిస్టింగ్ సమయంలో రూ. లక్షతో షేర్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు అది రూ. 20 లక్షల పైనే ఉందన్నమాట.

ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 2,880 రేంజ్ లో ఉండగా.. రూ. 3000 స్థాయిని తాకేందుకు పరుగులు పెడుతోంది. ఈ కంపెనీ ఆర్డర్ విలువ బలంగా ఉండడమే కాక.. బలమైన ఆదాయ వృద్ధిని కనబరుస్తుంది. దీంతో ఈ షేరు రయ్ అంటూ దూసుకెళ్తుంది.

త్వరలో ఈ షేరు ధర రూ.3000 దాటుతుందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. మరో వైపు మార్కెట్ లో ఈ షేర్ల ట్రేండింగ్ భారీగానే జరుగుతోంది.