Life Insurance Corporation: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఎల్ఐసీ పాలసీలలో న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ఒకటి కాగా పిల్లల చదువు, వివాహం కొరకు డబ్బులు ఆదా చేయాలని భావించే వాళ్లకు ఈ పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో రోజుకు రూ.150 ఇన్వెస్ట్ చేస్తే ఊహించని స్థాయిలో లాభాలు సొంతమవుతాయి.
25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో ఎల్ఐసీ ఈ పాలసీని అందిస్తుండటం గమనార్హం. సంవత్సరానికి ఏకంగా 55,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 19 లక్షల రూపాయలు చేతికి అందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా బీమాతో పాటు హామీ బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత నుంచి వాయిదాలను స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది.
Also Read: Jr NTR: చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్న ఎన్టీఆర్ కి నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?
20 ఏళ్లకు మరోసారి, 25 ఏళ్లకు ఒకసారి లబ్ధికారుడి ఖాతాలో డబ్బు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిడ్డ వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటే మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మెచ్యూరిటీ సమయంలో 60 శాతం కార్పస్, 40 శాతం బోనస్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో మినిమం సమ్ అస్యూర్డ్ లక్ష రూపాయలు కాగా గరిష్ట పరిమితి లేదు.
ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఇన్సూర్డ్ పర్సన్ కు యాక్సిడెంట్ అయితే కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Vijay Devarakonda Liger Movie: ‘విజయ్ దేవరకొండ’తో సోషల్ మీడియా బ్యూటీ రొమాన్స్