Neo Credit Card: మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా వస్తువులు కొంటున్నారా.. తరచూ షాపింగ్ మాల్స్‌కు, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తుంటారా.. ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారా.. కరెంటు, రెంటు, ఇతర బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తుంటారా.. సినిమాలకు వెళ్తుంటారా.. వీటన్నింటిపై డిస్కౌంట్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ కావాలా.. అయితే వెంటనే ఈ క్రెడిట్ కార్డు తీసుకోండి. ఎన్నెన్నో ఆఫర్లు మీరు సొంతం చేసుకోవచ్చు. డబ్బులు బాగా ఆదా అవుతాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డు..
ఎక్కువగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చే క్రెడిట్ కార్డు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చింది. అదే యాక్సెస్ నియో క్రెడిట్ కార్డు. ఇది లైఫ్‌టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. దాదాపు అన్ని రకాల కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఈ కార్డు ద్వారా పొందవచ్చు.
ఆఫర్లు ఇవీ..
– జొమాటోలో యాక్సెస్ నియో క్రెడిట్ కార్డుతో ఫుడ్ ఆర్డర్ చేస్తే 40 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.
– మ్యాక్స్‌లో షాపింగ్ చేస్తే రూ.120 డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్‌ను నెలకు రెండుసార్లు వినియోగించుకోవచ్చు.
– కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై రీచార్జ్, ఇంటి అద్దె ఇలా మనం ఆన్‌లైన్‌లో చెల్లించే బిల్లులపై యాక్సెస్ నియో కార్డు ద్వారా చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ వస్తుంది. నెలకోసారి మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
– యాక్సెస్ బ్యాంకు కొన్ని రెస్టారెంట్లతో టైఅప్ అయింది. మనం వాటికి వెళితే మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. కనీసం 15 శాతం డిస్కౌంట్ వస్తుంది.
– ఇక సినిమా చూసేందుకు బుక్‌మై షోలో యాక్సెస్ నియో క్రెడిట్ కార్డుతో టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం, బ్లింకిట్‌లో బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.
– మింత్ర ఈ కామర్స్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ కోసం యాక్సెస్ నియో కార్డు వినియోగిస్తే రూ.150 వరకు డిస్కౌంట్ వస్తుంది.
నెలకు రూ.10 వేలకుపైగా సేవ్..
మొత్తంగా యాక్సెస్ నియో కార్డుతో నెలకు కనీసం రూ.10 వేల వరకు సేవ్ చేయవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మీకు ఈ కార్డు కావాలనుకుంటే.. వెంటనే బ్యాంకును సంప్రదించండి.